దీంతో, తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత మధ్య ఉన్న కుటుంబ కలహాలు, విడిపోయే నిర్ణయం ముగిసిపోయినట్లే. ఈ ఊహించని పరిణామంతో విజయ్ అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ జోసెఫ్ వ్యక్తిగత జీవితం ఈ కేసు వల్ల బాగా వార్తల్లో నిలిచింది. ఇది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. కానీ, ఇప్పుడు సంగీత కేసును వెనక్కి తీసుకోవడంతో, దారి తప్పిన విజయ్ సంసారం మళ్లీ గాడిన పడినట్లయింది. అన్ని ఊహాగానాలకు, ఆందోళనలకు తెరపడింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇది త్రిషకి పెద్ద షాక్ అంటున్నారు. సంగీతతో విజయ్ విడిపోతే, త్రిషని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ కామెంట్లు రావడం గమనార్హం.