`స్పిరిట్‌` విషయంలో సందీప్‌ రెడ్డి వంగా కండీషన్‌, ప్రభాస్‌ అయినా సరే ఆ రూల్‌ పాటించాల్సిందేనా?

Published : Feb 08, 2025, 07:06 PM IST

Spirit Update: ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌` మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా విషయంలో ప్రభాస్‌కి సందీప్‌ రెడ్డి వంగా పెట్టిన కండీషన్‌ బయటకు వచ్చింది.   

PREV
15
`స్పిరిట్‌` విషయంలో సందీప్‌ రెడ్డి వంగా కండీషన్‌, ప్రభాస్‌ అయినా సరే ఆ రూల్‌ పాటించాల్సిందేనా?
prabhas, sandeep reddy vanga

Spirit Update: సందీప్‌ రెడ్డి వంగా చేసిన మూడు సినిమాలతోనే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయారు. ఇండియన్ టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. జస్ట్ మూడు సినిమాలతోనే టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఇదొక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. దీంతో సందీప్‌ రెడ్డి వంగా నుంచి సినిమా అంటే అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారు. 

25
prabhas, sandeep reddy vanga

ప్రభాస్‌లాంటి కటౌట్‌ సందీప్‌ రెడ్డికి దొరికితే, ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో ఊహకు కూడా అందదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో రాబోతున్న `స్పిరిట్‌` చిత్రంపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ మూవీ ఇంకా ప్రారంభం కూడా కాలేదు.

కానీ అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ బయటకు వచ్చింది. ప్రభాస్‌ కి సందీప్‌ పెట్టిన కండీషన్‌ షాకిస్తుంది. 
 

35
Prabhas, Fauji, Hanu Raghavapudi

ఈ మూవీ ప్రారంభానికి ఇంకా టైమ్‌ పడుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రభాస్‌ చేయాల్సిన `ది రాజా సాబ్‌`, హను రాఘవపూడి మూవీ `ఫౌజీ`లు షూటింగ్‌లు పూర్తి కావాలి. అవి అయిన తర్వాతనే `స్పిరిట్‌` ప్రారంభం కావాల్సి ఉంటుందట.

అయితే సహజంగా ప్రభాస్‌ అటు `ది రాజాసాబ్‌`, ఇటు `ఫౌజీ` షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఏక కాలంలోనే రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ `స్పిరిట్‌` విషయంలో అలా చేయడానికి లేదట. కచ్చితంగా తన సినిమా షూటింగ్‌లోనే పాల్గొనాలనే కండీషన్‌ పెట్టారట సందీప్‌ రెడ్డి. 

45
The Raja Saab

ప్రస్తుతం చేస్తున్న `ది రాజా సాబ్‌`, `ఫౌజీ` మూవీస్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాతనే తన సినిమాని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం నెల రోజులు రెస్ట్ కూడా తీసుకోవాలని ప్రభాస్‌కి తెలిపారట. ఈ రెండు సినిమాలు పూర్తి చేసుకున్నాక నెల పాటు ప్రభాస్‌ రెస్ట్ లో ఉంటారు. ఆ తర్వాత `స్పిరిట్‌` షూటింగ్‌లో పాల్గొనేలా ప్లాన్‌ చేస్తున్నారట.

ఆ తర్వాత నుంచి కంటిన్యూగా తన మూవీకే పరిమితం కావాలని, మరే మూవీ షూటింగ్‌లోనూ పాల్గొనడానికి వీలు లేదని సందీప్‌ చెప్పినట్టు సమాచారం. డార్లింగ్‌ కూడా ఆ రకంగానే ప్రిపేర్‌ అయ్యారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

55
prabhas

ఇదిలా ఉంటే ఈ మూవీలో డార్లింగ్‌ మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని ఇప్పటికే సందీప్‌ తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా చుట్టూ సినిమా సాగుతుందని తెలుస్తుంది.

అలాగే ఇందులో ప్రభాస్‌ రోల్‌ పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఉంటాయని సమాచారం. ఊహించని లుక్స్ లో ఆయన కనిపిస్తారని అంటున్నారు. డార్లింగ్‌ని మరి సందీప్‌ రెడ్డి వంగా ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి. కానీ ప్రభాస్‌ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉండబోతుందని మాత్రం చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read more: OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చిన థమన్‌, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్‌

also read: అర్జున్ రెడ్డి సీక్వెల్ కు రంగం సిద్ధం, విజయ్ దేవరకొండ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories