చిరు సిగరెట్ కాల్చే స్టైల్ చూసి..ఆ స్టార్ డైరక్టర్ స్మోకింగ్ కి ఎట్రాక్ట్ అయ్యాడట


చిరంజీవి  అలా సిగరెట్ తాగుతూ డైలాగ్ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ షాట్ చూసి నేను స్మోకింగ్ కు ఎట్రాక్ట్ అయ్యాను. 


తెరపై హీరోలు చేసే పనులు అభిమానులు అనుకరిస్తూంటారు. అందులో వింతేమీ లేదు. అందుకే యాడ్స్ ని స్టార్స్ తీసి ప్రమోట్ చేస్తూంటాయి పెద్ద పెద్ద కంపెనీలు. మరీ ముఖ్యంగా మాస్ లోకి బాగా వెళ్లిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటివారి మేనరింజలు అంటే ఫ్యాన్స్ కు మరీ పిచ్చి.

కొన్ని తరాలను తన నటనతో ఉర్రూతలూగిస్తూ ఇప్పటికి తన ప్రస్తానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న చిరంజీవి ఓ సినిమాలో సిగరెట్ కాల్చే స్టైల్ చూసి తనకు సిగరెట్ కాల్చాలనిపించాలనిపించిందని చెప్పుకొచ్చారు ప్రెజెంట్ స్టార్ డైరక్టర్. అతనెవరో కాదు సందీప్ రెడ్డి  వంగా.

Chiranjeevi


యూత్ లో సందీప్ రెడ్డి వంగాకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా తన మార్క్ ఏంటో చూపించాడు. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో రెగ్యులల్ గా సినిమాలు  తీసే ఫార్మూలాలను బ్రేక్ చేస్తుంటాడు. తనకు నచ్చినట్టుగా, కొత్త తరహా  సినిమాలను తీస్తుంటాడు. అలాగే సినిమా లెంగ్త్ ఇంతే ఉండాలనే  రూల్స్ అస్సలు పట్టించుకోడు. తను అనుకున్న కథను తనకు నచ్చినట్లుగా తెరకెక్కించాలనుకుంటాడు  తప్పా.. మిగతా ఏ విషయాలను పట్టించుకోడు. 
 



బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజై.. ఇప్పటికే రూ.600కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే, యానిమల్ మూవీపై కూడా విమర్శలు బలంగానే వస్తున్నాయి. అయితే, అంతకు మించి బ్లాక్‍బాస్టర్ హిట్ అవుతోంది.ఇక సందీప్ వంగా మొదటి నుంచీ మెగాస్టార్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi


సందీప్ వంగా ఎన్నో సార్లు చిరంజీవి మీదున్న ప్రేమను చాటుకున్నాడు. సినిమాల్లోకి రావడానికి చిరంజీవియే ఇన్‌స్పిరేషన్ అని, ఆయన సినిమాలంటే ఇష్టమనే, ఆయనే తన ఫేవరేట్ హీరో అని ఎన్నో సార్లు   చెప్పారు. చిరంజీవితో తప్పకుండా ఓ యాక్షన్ మూవీని చేస్తానంటూ  ఫ్యాన్స్‌తో ముచ్చటించినప్పుడు తన కోరికను బయటపెట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఓ మూవీ చేయాలని ఉందని అన్నారు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వూలో ఆయన చిరంజీవి సినిమాలోని ఓ సన్నివేశంలో చిరు సిగరెట్ కాల్చే స్టైల్ చూసి సిగరెట్ తాగాలనిపించిందని అన్నారు. 

Chiranjeevi


 ఇంటర్వ్యూలో సందీప్ వంగ ఏం మాట్లాడారంటే.. “చిరంజీవి గారి ఇన్‌ఫ్లుయెన్స్ నా మీద ఎప్పుడు ఉంటుంది. మాస్టర్ సినిమాలో హీరోయిన్ కి చిరంజీవి ‘నా గతం తెలుసా’ అని చెబుతున్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లో చిరంజీవి గారు గ్రీన్ షర్ట్ వేసుకొని, సిగరెట్ తాగుతూ అగ్రీసివ్ గా డైలాగ్స్ చెబుతారు.  అందులో చిరంజీవి సిగరెట్ పట్టుకునే స్టైల్, తాగే తీరు, యాక్టింగ్ చేసే తీరు అద్భుతంగా ఉంటుందని, ఆ స్టైల్ చూసిన తరువాతే సిగరెట్ తాగాలని తనకు అనిపించింది.  
 

 
ఆయన అలా సిగరెట్ తాగుతూ డైలాగ్ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ షాట్ చూసి నేను స్మోకింగ్ కు ఎట్రాక్ట్ అయ్యాను. అయితే ఆ షాట్ నాకు అలా మైండ్ లో గుర్తుండిపోయింది. అయితే వెంటనే సిగరెట్ కాల్చటం మొదలెట్టలేదు. అయితే ఆ తర్వాత సఖి సినిమాలో మాధవన్ సిగరెట్ కాల్చే షాట్ చూసాను. ఇలాంటి షాట్స్ నేను స్మోకింగ్ మొదలెట్టడానికి ఇన్స్పైర్ చేసాయి . అయితే నేను చెప్పేది ఒకటే, చిరంజీవి గారో, మాధవన్ గారో సిగరెట్ కాలుస్తున్నారని నేను మొదలెట్టను. నేను అవి చూడకపోతే వేరే చోట నుంచి ప్రేరణ తెచ్చుకుని మొదలెట్టేవాడిని. ” అంటూ పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 150 సినిమాలకు పైగా  నటించి.. సూపర్ డూపర్ హిట్స్ తో పాటు.. బ్లాక్ బస్టర్ హిట్స్ ను కూడా అందించారు. ఈక్రమంలో ఆయన కోట్లాది ఫ్యాన్స్ ను సంపాధించడంతో పాటు.. టాలీవుడ్ కే పెద్దదిక్కుగా మారారు. 

తెలుగు సినీ పరిశ్రమలో.. మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు చిరంజీవి. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ మాదిరి.. టాలీవుడ్ లో చిరంజీవి కుటంబం నుంచి అరడజను పైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. స్టార్లు గా వెలుుగు వెలుగుతున్నారు. 

చిరూతో యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఇష్టపడతానని తెలిపారు. “ఒకవేళ అవకాశం ఇస్తే, మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా చేయాలని ఉంది” అని తన మనసులో మాటను సందీప్ రెడ్డి వంగా చెప్పారు. తనకు చిరంజీవి ఇష్టమని గతంలో కూడా సందీప్ వెల్లడించారు. ఇప్పుడు ఆయనతో సినిమా తీయాలనుందంటూ వెల్లడించారు.

Latest Videos

click me!