జానీ మాస్టర్ తనను మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించారు. అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు, అలాగే తన నివాసంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఆవేదన చెందారు. జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం క్రింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. నార్సింగ్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన యువతికి అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడనే న్యూస్ బయటకు వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా నువ్వు పని చేస్తావని అల్లు అర్జున్ హామీ ఇచ్చాడట. దీనిపై అధికారిక సమాచారం లేదు.