ఆడిషన్ కు పిలిచి బెడ్ షేర్ చేసుకుంటావా అని అడిగాడు: సీరియల్ హీరోయిన్

First Published | Aug 6, 2024, 8:18 AM IST

 ప్రారంభం రోజుల్లో ఆడిషన్స్ కు పిలిచి ఎక్సప్లాయిట్ చేయబోయారని చెప్పుకొచ్చింది. 

ఈ మధ్యన వరస పెట్టి దక్షిణాది డైరక్టర్స్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నారు బాలీవుడ్ భామలు. గత జ్ఞాపకాలను తవ్వుకుంటూ తాము ప్రారభం రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డామో చెప్తున్నారు. తమని డైరక్టర్స్, హీరోలు ప్రక్క మీదకు పిలిచేవారిని డైరక్ట్ గా చెప్తున్నారు. అయితే వాళ్ల పేర్లేమీ ప్రస్తావించటం లేదు. ఓ తెలుగు డైరక్టర్, ఓ దక్షిణాది డైరక్టర్ అంటూ ఎడ్రస్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్‌ బుల్లితెర నటి సనాయా ఇరానీ చేరింది. 
 


సనాయా ఇరానీ మొదటిగా ఆమిర్ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన ‘ఫనా’ సినిమాలో ఓ చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. షారుఖ్‌ ఖాన్‌, కరీనా వంటి ప్రముఖ స్టార్లతో కలిసి అనేక  టీవీ ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత  బాలీవుడ్ బుల్లితెర వైపు అడుగులు వేసింది. ‘మిలే జబ్‌ హమ్‌ తుమ్‌’ టీవి సీరియల్ లో గుంజన్ పాత్రతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. పలు హిట్‌ సీరియల్స్తో పాటు ‘ఝలక్‌ దిక్లాజా’, ‘నచ్‌ బలియే’ రియాలిటీ షోలతో మరింత క్రేజ్‌ పెంచుకుంది.


 
 తన అందం, అభినయంతో ‘ఈస్టర్న్-ఐ’ వంటి అంతర్జాతీయ మ్యాగజైన్‌ల గుర్తింపు పొందింది సనాయా. అయితే ఇప్పుడున్న క్రేజ్‌ను పక్కన పెడితే చిన్నతనంలో చాలామంది అమ్మాయిల్లాగే తాను కూడా ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానంటోందీ  టీవి స్టార్. ముఖ్యంగా తనను ప్రారంభం రోజుల్లో ఆడిషన్స్ కు పిలిచి ఎక్సప్లాయిట్ చేయబోయారని చెప్పుకొచ్చింది. 


అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ... ఓ సౌతిండియాకు చెందిన ఫిల్మ్ మేకర్ నా ప్రారంభం రోజుల్లో సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని పిలిచారు. నాకు అప్పుడు సినిమాలు చేయటం ఇష్టం లేదు. కానీ పట్టుబట్టడంతో నేను వేరే దారిలేక ఆ డైరక్టర్ ని కలిసాను. అతని తో మీటింగ్ పూర్తయ్యాక నాకు అర్దమైన విషయం నాలాంటి ప్రారంభంలో ఉన్న అమ్మాయిలను మీటింగ్ కలిసేది కేవలం మేము వాళ్లతో బెడ్ షేర్ చేసుకుంటామా లేదా అనేది తెలుసుకోవటానికే. అంతే తప్పించి కథ చెప్పటానికో, మా యాక్టింగ్ స్కిల్స్ తెలుసుకోవటానికో కాదు అని చెప్పింది. 


 అలాగే మరో సంఘటన చెప్తూ .. .. ' మ్యూజిక్ వీడియో కోసం ఆడిషన్ చేస్తున్నామని మొదట నాతో చెప్పారు. కానీ అక్కడికి వెళ్లాక ఇది ఒక సినిమా కోసమని తెలిసింది. దీంతో నేను అక్కడే ఉన్న సెక్రటరీకి ఆడిషన్‌ చేయనని చెప్పా. ప్లీజ్ సార్‌కు కోపం వస్తుంది.. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని ఆమె నాతో చెప్పింది. ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. 'నేను ఈ పెద్ద సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో మీరు బికినీ వేసుకోవాలి. మీరు బికినీ ధరించేందుకు సిద్ధమేనా?' అని అడిగాడని చెప్పుకొచ్చింది.


ఆ తర్వాత "అతని సెక్రటరీ చెప్పడంతో నేను అతనికి కాల్ చేసాను. నేను మీటింగ్‌లో ఉన్నా.. అరగంట తర్వాత నాకు కాల్ చేయండి అన్నాడు. మరోసారి 45 నిమిషాల తర్వాత కాల్ చేశా. ఇప్పుడు టైం ఎంత? నిన్ను ఏ సమయానికి చేయమని అడిగాను? అని నాపై కోప్పడ్డాడు. దీంతో అతనికి దర్శకుడిగా పనికిరాని వాడని నాకర్థమైంది' అని వివరించింది. 
 

Image: Sanaya Irani Instagram


 ఇప్పుడున్న క్రేజ్‌ను పక్కన పెడితే చిన్నతనంలో చాలామంది అమ్మాయిల్లాగే తాను కూడా ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానంటోందీ అందాల తార. ముఖ్యంగా తన స్కిన్‌టోన్‌కు సంబంధించి తోటి విద్యార్థుల చేతిలో హేళనకు గురయ్యానంటూ తన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది.
 


‘నేను ముంబయిలో పుట్టి పెరిగినా నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఊటీలో సాగింది. అక్కడి బోర్డింగ్‌ స్కూల్‌లో ఏడేళ్లు చదువుకున్నాను. మాది జొరాస్ట్రియన్‌ ఫ్యామిలీ. ముఖం కొంచెం ఎరుపు రంగులో ఉన్నా చాలా అందంగా ఉండేదాన్ని. అయితే తోటి విద్యార్థులకు మాత్రం నా స్కిన్‌టోన్ మరోలా కనిపించింది. వారు నన్ను చూసినప్పుడల్లా బల్లి, తెల్ల బొద్దింక.. అంటూ ఎగతాళి చేశారు. ఇక్కడ విషయమేమిటంటే...వారి కంటే నేను పదిరెట్లు అందంగా కనిపించేదాన్ని. అయినా నాపై కామెంట్లు చేసేవారు’..
 

 
‘ఇంకో సందర్భంలో ఒక గుజరాతీ ఫ్యామిలీ నా కలర్‌ను చూసి హేళన చేసింది. ఒకసారి స్కూల్‌లో నేను ఐస్‌క్రీం తింటున్నప్పుడు వారు నా సమీపంలోనే కూర్చున్నారు. మాటల మధ్యలో నన్ను చూసి ‘హే...ఒకసారి ఆ పిల్లను చూడండి... అచ్చం కోతిలా లేదూ’ అని ఎగతాళి చేశారు.  

నాకు గుజరాతీ అర్థం కాదనే వారు అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అయితే నాకు గుజరాతీ వచ్చనే విషయం వారికి తెలియదు. నా ఎర్రటి ముక్కు, బుగ్గలను చూసే వారు అలా మాట్లాడారని నాకు అర్థమైంది. ఇలాంటి అవమానాల వల్ల ఎవరితో స్వేచ్ఛగా మాట్లాడేదాన్ని కాదు. నలుగురిలో కలిసేందుకు భయపడేదాన్ని. అయితే ఎదిగే కొద్దీ ఇలాంటి విమర్శలు, అవమానాల గురించి పట్టించుకోవడం మానేశాను.. నా లక్ష్యాల పైన మాత్రమే దృష్టి సారించాను..’ అని గుర్తుకు తెచ్చుకుందీ బుల్లితెర బ్యూటీ.

Sanaya Irani


కాగా.. 'మిలే జబ్ హమ్ తుమ్', 'ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్' వంటి టీవీ షోలతో బాలీవుడ్‌లో సనయా గుర్తింపు తెచ్చుకుంది. సనయ చివరిగా షార్ట్, బటర్‌ఫ్లైస్ సీజన్ -4లో కనిపించింది. బాలీవుడ్‌లో ‘మిలే జబ్ హమ్ తుమ్ అండ్ ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్’ వంటి టీవీ సిరీయ‌ల్స్‌లో న‌టించి స్టార్ బుల్లితెర న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. 

Latest Videos

click me!