అక్కినేని నాగార్జున సతీమణి అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కిరాయి దాదా సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు. కిరాయి దాదా మంచి విజయం సాధించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్ లతో సినిమాలు చేసింది. రక్త తిలకం, అగ్గి రాముడు, రాజా విక్రమార్క, ఆగ్రహం వంటి సినిమాల్లో నటించింది.