ప్రాజెక్ట్ కే టీమ్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో సందడి చేస్తుంది. ప్రభాస్, రానా, కమల్ హాసన్ హాజరయ్యారు. ప్రభాస్ సూట్ ధరించి రాయల్ లుక్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జులై 20 నుండి 23 వరకు శాన్ డియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ జరగనుంది. తొలిసారి ఓ ఇండియన్ మూవీ ఈ ఈవెంట్ లో ప్రాతినిథ్యం వహిస్తుంది. ప్రాజెక్ట్ కే చిత్రానికి కామిక్ కాన్ 2023 ఆహ్వానం దక్కింది.
26
Prabhas at San Diego comic con
ప్రభాస్, కమల్ హాసన్, రానా కామిక్ కాన్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ సినిమా వేదికగా ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ టీజర్ విడుదల చేయనున్నారు. జులై 20న యూఎస్ లో ప్రాజెక్ట్ కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
36
Prabhas at San Diego comic con
భారత కాలమానం ప్రకారం 21న ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ టీజర్ అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో టీజర్ పై ఆసక్తి పెరిగింది.
46
Prabhas at San Diego comic con
ప్రాజెక్ట్ కే చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడు. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది.
56
Prabhas at San Diego comic con
ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. దిశా పటాని కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ సైతం ప్రాజెక్ట్ కేలో నటిస్తున్నట్లు వెల్లడించారు. దాంతో హైప్ మరింత పెరిగింది.
66
Prabhas at San Diego comic con
అలాగే అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. 2024 సంక్రాంతి కానుకగా మొదటి పార్ట్ విడుదల చేస్తున్నారు.