అందుకే ఇంటి పేరు నాకు వద్దు అనుకున్నా.. సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్

Published : Feb 09, 2023, 10:49 PM IST

వరుస ఇంటర్వ్యలతో సందడిచేస్తుంది మలయాళ భామ సంయుక్త. గతంలో సంయుక్త మీనన్ గా ఉన్న తన పేరులో ఇంటిపేరు తీసేసింది బ్యూటీ... దానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది సంయుక్త. 

PREV
17
అందుకే  ఇంటి పేరు నాకు వద్దు అనుకున్నా.. సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్

తెలుగు తెరపై మెరుస్తున్న మలయాళ సోయగం సంయుక్త. మలయాళం సినిమాలతో హీరోయిన్ గా పరిచమైన  ఈ నటి తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చిన్నగా టాలీవుడ్ లో పాతుకుపోయే ప్రయత్నంచేస్తోంది. ధనుష్ హీరోగా  తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న  బై లింగువల్ మూవీ సార్ లో హీరోయిన్ గా నటిస్తోంది

27

రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో...  ఈమూవీ ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు.  తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది సంయుక్తా.. . తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో... సంచలన విషయాలు వెల్లడించింది మలయాళ హీరోయిన్. 
 

37

తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించక పోయిన తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో హీరోయిన్ గా నటించింది. 
 

47

హీరోయిన్ సంయుక్త మీనన్.. రీసెంట్ గా  తన పేరులో కొన్ని మార్పులు చేసుకున్ారు. తన పేరులో ఉన్న మీనన్ ని తొలిగించింది. అయితే ఈ విషయంలో  తాజాగా ఇచ్చిన  ఇంటర్వ్యూలో  వివరణ కూడా ఇచ్చింది. సంయుక్తా మాట్లాడుతూ.. మనం స్కూల్ లో అడ్మిట్ అవుతున్నప్పుడు మన పేరుతో పాటు ఇంటి పేరుని కూడా రాస్తుంటారు. అలాగే సంయుక్త అనే నా పేరు వెనుక మీనన్ రాశారు. 

57

ఒక వ్యక్తి పేరు వెనుక ఇటువంటి తోకలు ఎందుకు ఉంటాయో అప్పుడు అర్ధమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అర్ధమైంది. మనిషుల మధ్య సమానత్వానికి ఇంటి పేరు అడ్డు వస్తుంది అని నాకు అర్ధం అయ్యింది. ఇంటి పేరుని ఎప్పటినుంచో తొలిగించాలి అని అనుకుంటున్నాను. కాస్త లేట్ అయినా సరేఇక పై మీనన్ ని నా పేరు వెనుక కొనసాగించేది లేదు అన్నారు. 

67

ఇక నా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా మీనన్ ని తొలిగించాను అన్నారు.  సంయుక్త పేరెట్స్ కూడా విడాకులు తీసుకోవడంపై ఆమె స్పందించారు.  మా అమ్మానాన్నలు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ పేరుని కొనసాగించడం మా అమ్మకి కూడా ఇష్టం లేదు. ఆమె ఇష్టానికి గౌరవం ఇవ్వాలి అనిపించింది అంటూ వివరించింది సంయుక్తా. 

77

ఇక తాను చిన్నతనంలో ఎదుర్కోన్న కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చింది సంయుక్త. అయితే తనకు అలాగే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదురుకున్నాను. అందుకనే ఎమోషనల్ సీన్స్ లో నటించడం నాకు సవాలుగా అనిపిస్తుంది అంటూ తెలియజేసింది.

Read more Photos on
click me!

Recommended Stories