గ్రీన్ డ్రెస్ లో కట్టిపడేసిన సంయుక్త మీనన్.. విరూపాక్ష ప్రీ రిలీజ్ లో చూపులన్నీ ఆమెపైనే..

Published : Apr 16, 2023, 10:59 PM IST

విరూపాక్ష ప్రీ రిలీజ్ వేడుకలో సంయుక్త మీనన్ అందరి చూపులని తనవైపు తిప్పుకుంది. కళ్ళు చెదిరే గ్రీన్ డ్రెస్ లో సంయుక్త మీనన్ చిరునవ్వులు చిందిస్తూ మెరుపులు మెరిపించింది.

PREV
16
గ్రీన్ డ్రెస్ లో కట్టిపడేసిన సంయుక్త మీనన్.. విరూపాక్ష ప్రీ రిలీజ్ లో చూపులన్నీ ఆమెపైనే..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. 90 దశకం వరకు పలు గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాలు, చేతబడి లాంటి వ్యవహారాలపై ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు విజువల్ థ్రిల్లర్ గా రూపొందించారు.   
 

26

  ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న తరుణంలో నేడు ఏలూరులో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకకు సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. 

36

సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత వస్తున్న తొలి చిత్రం ఇదే. దీనితో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది.  విరూపాక్ష ప్రీ రిలీజ్ వేడుకలో సంయుక్త మీనన్ అందరి చూపులని తనవైపు తిప్పుకుంది. 

46

కళ్ళు చెదిరే గ్రీన్ డ్రెస్ లో సంయుక్త మీనన్ చిరునవ్వులు చిందిస్తూ మెరుపులు మెరిపించింది. చూపు తిప్పుకోలేని అందంతో సంయుక్త మీనన్ ప్రీ రిలీజ్ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 

56

ప్రీరిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరూ సంయుక్త ని టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ అంటూ కీర్తించారు. ఆమె నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడమే అందుకు కారణం. 

66

ఇక సంయుక్త మీనన్ కూడా తన ప్రసంగంతో ఆకట్టుకుంది. తనకు పిల్లల నుంచి పెద్దల నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోందని.. అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సంయుక్త తెలిపింది. 

click me!

Recommended Stories