చీరకట్టి పద్దతిగా కవ్విస్తున్న శోభితా.. రెడ్ శారీలో ‘పొన్నియిన్ సెల్వన్’ భామ గ్లామర్ మెరుపులు..

First Published | Apr 16, 2023, 10:17 PM IST

యంగ్ బ్యూటీ శోభితా దూళిపాళకు ఒక్క సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.  బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ క్రేజ్ పెంచుకుంటోంది. 
 

యంగ్ హీరోయిన్ శోభితా దూళిపాళ తన కేరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. బాలీవుడ్ తో సినీరంగంలో అడుగుపెట్టింది. ‘రామన్ రాఘవ్ 2.0’తో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.
 

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ యంగ్ బ్యూటీ అచ్చమైన తెలుగు అమ్మాయి అని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి ప్రాంతానికి చెందిన శోభితా విశాఖపట్నంలోనే పెరిగింది. తన ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లింది. 
 


పదహారేళ్ల వయసులోనే ఒంటరిగా ముంబైకి వెళ్లిన ఈ బ్యూటీ.. ముంబై విశ్వవిద్యాలయంలోని H.R.కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చేరింది.  అదే సమయంలో ఆమె భరతనాట్యం, కూచిపూడిలోనూ శిక్షణ పొందింది. నేవీ క్వీన్ గానూ 2010లో క్రౌన్ ను గెలుచుకుంది. అలా మోడల్ గా మారి.. సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. 
 

తెలుగులో ‘గూఢాచారి’, ‘మేజర్’, తమిళంలో ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.  ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంటోంది. ఇటీవల నాగచైతన్యతో డేటింగ్ చేస్తుందంటూ గట్టిగా  ప్రచారం జరగడంతో మరింతగా పాపులర్ అయ్యింది. అవన్నీ  రూమర్లేనని రీసెంట్ గా ఖండించిన విషయం తెలిసిందే. 
 

 అయితే, శోభితా సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా ముంబైలో సబ్యసాచి ఫ్లాగ్‌షిప్ ప్రారంభోత్సవం కోసం బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది.  చీరకట్టులో దర్శనమిచ్చి అభిమానులు,  నెటిజన్లను కట్టిపడేసింది. ఈ క్రమంలో ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను షేర్ చేసుకుంది. 

తాజాగా శోభితా రెడ్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నారు. డీప్ నెక్ బ్లౌజ్ లో  బ్యాక్ అందాలను చూపిస్తూ.. కూర్చీపై పద్ధతిగా కూర్చొని  కొంటె ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. మత్తు చూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

ఇంటర్నెట్ లో 3.2 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న శోభితా మరింత దక్కించుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ ఇలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.  తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఈ బ్యూటీ  పోస్టులను క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అటు నార్త్, ఇటు సౌత్ లో శోభితా ఆఫర్లు అందుకుంటోంది. తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో త్వరలో అలరించబోతోంది. హిందీలో ‘సితార’ అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఇంగ్లీష్ చిత్రం ‘మంకీ మ్యాన్’లోనూ కీలక పాత్రలో మెరియనుంది. చిత్రాలన్నీ ఈ ఏడాది విడుదల కానున్నాయి. 
 

Latest Videos

click me!