భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా సంయుక్త నటించింది. ఆ చిత్రంలో సంయుక్త ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు బింబిసారలో కూడా సంయుక్త నటన గురించి మంచి విషయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంయుక్త మీనన్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ సరసన సార్ చిత్రంలో నటిస్తోంది.