Bigg Boss Telugu 6: ఇప్పటిదాకా చేసిన సేవలు వేస్ట్... అర్జున్ ముందే శ్రీహాన్ తో రొమాన్స్ చేసిన శ్రీసత్య!

Published : Oct 04, 2022, 03:58 PM IST

శ్రీసత్యను లైన్ లో పెట్టడానికి అర్జున్ పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలన్నీ వేస్ట్ అయ్యాయి. ఆమె కంటెస్టెంట్ శ్రీసత్యతో రొమాన్స్ చేసింది. చేసేదేమీ లేక అర్జున్ చూస్తుండిపోయాడు.   

PREV
17
 Bigg Boss Telugu 6: ఇప్పటిదాకా చేసిన సేవలు వేస్ట్... అర్జున్ ముందే శ్రీహాన్ తో రొమాన్స్ చేసిన శ్రీసత్య!
Bigg Boss Telugu 6

బిగినింగ్ నుండి అర్జున్ కళ్యాణ్ కంటెస్టెంట్ శ్రీసత్యను లైన్ లో పెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆమెను బాగా ఇష్టపడుతున్న అర్జున్ గేమ్ మీద కూడా దృష్టి పెట్టడం లేదని తోటి కంటెస్టెంట్స్ చెవులు కొరుక్కుంటున్నారు. హోటల్ టాస్క్ లో అడగగానే తన దగ్గరున్న డబ్బులన్నీ శ్రీసత్యకు ఇచ్చేశాడు అర్జున్. దాంతో అతడు మిగతా గేమ్ ఆడలేకపోయాడు.

27
Bigg Boss Telugu 6

ఆ కారణంగా జైలుపాలు కూడా అయ్యాడు. హౌస్ లో ఎక్కువ సమయం అర్జున్ ఆమెతోనే గడుపుతాడు. టాస్క్స్ లో శ్రీసత్య కష్టపడితే పాదాలకు మసాజ్ చేస్తాడు.కీలకమైన నామినేషన్స్ లో సైతం తాను నామినేటై, శ్రీసత్యను సేవ్ చేశాడు. మొత్తంగా శ్రీసత్య కటాక్షం కోసం ఎదురుచూస్తున్న అర్జున్ ఆమె సేవల్లో తరిస్తున్నాడు. 

37
Bigg Boss Telugu 6

ఇంత చేస్తే ఆమె పోయి శ్రీహాన్ తో రొమాన్స్ చేసింది. ఓ సాంగ్ కి శ్రీహాన్-శ్రీసత్య అదిరిపోయే కెమిస్ట్రీ కురిపిస్తుంటే అర్జున్ వాళ్ళను చూస్తూ ఉండిపోయాడు. అతడి ముఖంలో ఈర్ష్య, బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. మనసులో ఏమనిపించినా చేసేది ఏమీ లేదు. అది బిగ్ బాస్ హౌస్ ఎవరి ఇష్టం వారిది. మనకు నచ్చిన అమ్మాయి వేరే అబ్బాయికి దగ్గర అవుతుందని నొచ్చుకోవడానికి లేదు. 
 

47
Bigg Boss Telugu 6

కాగా నేటి ఎపిసోడ్ బిగ్ బాస్ కొంచెం ఎంటర్టైనింగ్ గా నడిపించాడు. పండగ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేయాలంటూ ఆదేశించారు. బిగ్ బాస్ బర్త్ డే పార్టీ, ఆయన్ని కంటెస్టెంట్స్ ఎంటర్టైన్ చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్జే సూర్య మిమిక్రీ చేశాడు. ఫైమా కామెడీ స్కిట్ తో నవ్వులు పూయించింది.

57
Bigg Boss Telugu 6


ఇక శ్రీహాన్, శ్రీసత్య సాంగ్ కి డాన్స్ వేశారు. కాగా హౌస్ లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీక్రెట్ రూమ్ లోకి గీతూని పిలిచిన బిగ్ బాస్ వేడి వేడి చికెన్, కోక్ ఆఫర్ చేశాడు. అయితే అది తినాలంటే చిన్న కండీషన్ పెట్టారు. హౌస్ కి సంబంధించిన మంచి గాసిప్ చెప్తే.. చికెన్ తినొచ్చు అన్నాడు. 

67
Bigg Boss Telugu 6


దానికి గీతూ... ఇనయ-ఆర్జే సూర్య మధ్య సంథింగ్ సంథింగ్ రగులుతుంది మొగలిపొద అని చెప్పింది. అయితే అది సరిపోదన్నారు బిగ్ బాస్. తర్వాత బాల ఆదిత్య ఎప్పుడూ దీపు దీపు అంటున్నాడు. అది నచ్చడం లేదు బిగ్ బాస్ అని రెండో గాసిప్ చెప్పింది. చికెన్ తినడానికి ఆ గాసిప్ కూడా చాలదని బిగ్ బాస్ అన్నారు. 

77
Bigg Boss Telugu 6


మరి బిగ్ బాస్ సంతృప్తి చెందే గాసిప్ గీతూ ఏమి చెప్పిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. ఇక నిన్న నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. మెరీనా, ఇనయా, ఆదిరెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం ఆరోహిరావు హౌస్ ని వీడడం జరిగింది. 
 

click me!

Recommended Stories