ఇద్దరి మధ్య ఇన్ని అపార్ధాలు వచ్చేవి కాదు చ అని అనుకుంటాడు. నందు లాస్యలు ఇంటిలోకి వెళ్ళగానే దివ్య, దేవుడా నీకు ఎన్ని దండాలు పెట్టుకున్నాను వీళ్లు రాకూడదు అని ఇంక ఈ రోజు కార్యక్రమం అంతా చెడిపోయినట్టే అని అనుకుంటుంది. లక్కీ మనసులో, మేమందరం ఇక్కడ ఆనందంగా ఉన్నాము అని తెలిస్తే మీరు ఇక్కడికి వచ్చేస్తారు అని నేను ముందే అనుకున్నాను అని అనుకుంటాడు. అప్పుడు నందు,లాస్య తో, వద్దంటే లాక్కొని వచ్చావు ఇక్కడ ఒకరు కూడా పలకరించట్లేదు అని అనగా లాస్య గట్టిగా, ఇచ్చెయ్ నందు, నువ్వు దివ్య కోసం పరీక్షలు బరాయాలని పూజ చేయించావు కదా. ప్రసాదం ఇవ్వడానికి వచ్చావు కదా ఇవ్వు అని నందు చేత దివ్యకి ఇప్పిస్తాది లాస్య.