ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి థాంక్స్ పెద్దమ్మ అని దేవిని బుగ్గలు గిల్లు. అంతలో రిషి అక్కడికి వస్తాడు.అప్పుడు జగతి రిషి కి ఇష్టమో లేదో ఒక మాట అడగండి అని అనగా రిషి, వసుధార తనతో చెప్పిన సంఘటనను గుర్తుతెచ్చుకుంటాడు.జగతి మేడం వాళ్లు,వాళ్ళంతట వాళ్ళు జరుపుకుంటే అది సెలబ్రేషన్ అవుతాది సార్, అదే మీరు వాళ్ళ కోసం జరిపిస్తే అది సంబరం అవుతది అని అంటుంది. ఆ మాటలు గుర్తుతెచ్చుకున్న రిషి, ఇంట్లో పెద్దమ్మ ఏం చేసినా కుటుంబం మంచి కోసమే కనుక పెద్దమ్మ ఏం చేసినా నేను ఆపను అని చెప్పి జగతి మహీంద్రాలు వెళ్లి శుభాకాంక్షలు అని అంటాడు. దానికి జగతి మహీంద్రాలు ఎంతో ఆనంద పడిపోతారు. ఆ తర్వాత రిషి తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు.