Intinti Gruhalakshmi: తులసికి సలహా ఇచ్చిన సామ్రాట్.. అంకితను ఇంట్లో వాళ్లకు దూరం చేయాలనుకుంటున్న అభి?

First Published Feb 4, 2023, 9:14 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో అభి వినడానికి ఎంత హాయిగా ఉంది ఆంటీ అనడంతో నేనేం హరి కథ చెప్పలేదు నువ్వు తీరిగ్గా కూర్చొని వినడానికి వెళ్లి ఆ పని చూడు. అయినా పెళ్ళాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోలేని మగాడివి నువ్వే మగాడివి అని అభి ముఖం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గాయత్రి. ఏంటి ఆంటీ ఒకసారి అంతలా అనేసింది అయినా తప్పదు కదా మాటలు పడాల్సిందే అని అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తులసి ఆఫీస్ కి వెళ్తుండగా ఇంతలో అభి అంకిత గదిలో పోట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు బయటకు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు అనసూయ, పరందామయ్య తులసి ఆ మాటలు వింటూ ఉంటారు. ఇంతలోనే అంకిత, అభి వాళ్ళు బయటికి రావడంతో ఎందుకురా అంతలా అరుస్తున్నారు ప్రశాంతంగా మాట్లాడుకోలేరా అనగా తనే గట్టిగా అరుస్తుంది మామ్ అంటాడు అభి.
 

చూడండి ఆంటీ వాళ హాస్పిటల్ లో పని చేయమని అడుగుతున్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్ నాకు పడదు అది ఈ మాట ఎప్పటినుంచో చెబుతున్నాను అంటుంది అంకిత. అప్పుడు ఇష్టం లేదు అన్నప్పుడు ఎందుకురా ఫోర్స్ చేస్తావు అని నందు అనడంతో చూడండి డాడ్ లైఫ్ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు తను ఒక హాస్పిటల్లో నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తోంది. ఎప్పుడు వస్తున్నామో ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియదు కనీసం సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా టైం లేదు అంటాడు అభి. పేరుకే భార్య భర్తలము ఇంట్లో ఉంటే మామ్ దగ్గర లేదా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. లైఫ్ అంటేనే విసుగువస్తోంది డాడ్ అంటాడు అభి. ఒకేచోట ఉంటే కనీసం కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు. భార్యతో గడపడం తప్ప మామ్ అని అనగా లేదు అంటుంది తులసి.
 

అప్పుడు తులసి అభి మాటలు అర్థం చేసుకోమ్మా వాడి బాధని అర్థం చేసుకుని వాడితి పాటు హాస్పిటల్ కి వెళ్ళు అనడంతో సరే ఆంటీ అని అంటుంది అంకిత.  అప్పుడు అభి, అంకిత అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత ప్రేమ్ నందులు కూడా సైట్ విసిట్ చేయడానికి అక్కడ నుంచి వెళ్లిపోతారు.  అప్పుడు పరంధామయ్య నువ్వు అన్నది కరెక్టే తులసి, నందు విషయం పరిష్కారం కావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు అంటాడు పరంధామయ్య. ఆ తర్వాత అభి అంకిత ఒక బైక్ లో నందు, ప్రేమ్ ఒక బైక్ లో తులసి ఒక బైక్ లో వెళ్లడం చూసి అనసూయ పరందామయ్యలు సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు లాస్య  ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి నందు సంపాదించేలోపు నేను ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.

తర్వాత సామ్రాట్,తులసి ఇద్దరు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా మీరు పెట్టే మెయిల్స్ చూస్తే నాకు సరదాగా ఉంటుంది అండి మీకు ఇలాంటి ఆలోచనలు లేక నుంచి వస్తాయి అనడంతో ఆ దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు అని అంటుంది తులసి. అప్పుడు లైఫ్ లో అన్నీ మీరు పాజిటివ్ గా తీసుకుంటారు అనడంతో అందుకే నేను వెనుకబడిపోయాను. అప్పుడు తులసి కాస్త బాధగా మాట్లాడడంతో సామ్రాట్ జోకులు వేసి నవ్విస్తూ ఉంటాడు.. అప్పుడు సామ్రాట్ ఎలా అయినా నందు ని ఒక దారిలోకి తెచ్చే ప్లాన్ లో ఉన్నారు అనడంతో ఇప్పుడే కథ మొదలు పెట్టాను పూర్తి అవ్వాలి అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా సమస్యలు తప్పవు అంటుంది తులసి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్ కేఫ్ మూసివేసి బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు మీరు ఓకే అంటే వారితో నేను మాట్లాడే సెట్ చేస్తాను అనడంతో ఓకే కానీ అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది.
 

ఎందుకు మొహమాటపడుతున్నారు అనడంతో అంతా ఒకేసారి కట్టలేము ఇన్స్టాల్మెంట్లో కడతాము అనగా వాడు మా ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు మీరేం భయపడకండి అంటాడు సామ్రాట్. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నందు కేఫ్ లో ఫర్నిచర్ సెట్ చేసుకోవడానికి ఎంత లో ఎంతైనా ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని అనగా ఈడ్చి కొడితే మన దగ్గర 50 వేలు లేవు అంత లెక్క ఎలా సంపాదిస్తావు అని అంటుంది లాస్య. అమ్ముకోవడానికి నా దగ్గర అత్తింటివాళ్లు పెట్టిన నగలు కూడా లేవు అనడంతో వెంటనే అనసూయ అత్తింటి వాళ్ళు నేను ఇంట్లో ఉంచుకోవడమే గొప్ప మల్ల బంగారం పెట్టడం కూడానా అని అంటుంది. అప్పుడు లాస్య డొంక తిరుగుడు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది.. ఇంతలోనే అభి,అంకిత అక్కడికి రావడంతో ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు అనగా రా అభి కరెక్ట్ సమయానికి వచ్చావు అంటుంది లాస్య. అప్పుడు డొంక తిరుగుడు మాటలు ఎందుకు ఈ ఇంట్లో ఇప్పుడు నీకు సహాయం చేసేకి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అభి మాత్రమే అంటుంది లాస్య.
 

అప్పుడు పరంధామయ్య ఐదు లక్షలు అవుతుందట చెక్ ఇస్తావు క్యాష్ ఇస్తావో చెప్పురా అభి అనగా నా దగ్గర అంత డబ్బులు లేవు అని అంటాడు అభి. నీ దగ్గర డబ్బులు లేవు నీకు పిల్లనిచ్చిన అత్తగారి దగ్గర ఉన్నాయి కదా నువ్వు అడిగితే ఇవ్వను అంటాదా ఏంటి అని అంటుంది లాస్య. ఐదు లక్షలు కాదు 50 లక్షలైన ఎడమ చేతితో ఇస్తుంది కాదంటావా అని అంటుంది లాస్య. నా నోట్లో నుంచి మాట రావడమే ఆలస్యం వెంటనే డబ్బులు ఇస్తుంది కాకపోతే ఒక ఒక కండిషన్ ఉంది. నేను అడిగినంత డబ్బు ఇవ్వాలి అంటే ఆవిడ చెప్పిన విధంగా నేను అంకిత వేరే ఇంట్లో కాపురం పెట్టాలి అంటాడు అభి. ఆ మాటకు అంకిత షాక్ అవుతుంది. కావాలంటే మీ అత్తగారిని కూడా ఇక్కడికి రమ్మను కానీ విడిపోయి ఆలోచన మాత్రం రానివ్వకు అంటాడు ప్రేమ్. కరెక్ట్ గా ఆలోచించు ప్రేమ్ మేము అక్కడికి వెళ్తే నాన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మన లైఫ్ కూడా సెటిల్ అవుతుంది కదా అని అనగా అప్పుడు నందు నాకైతే ప్రాబ్లం ఏమీ కనిపించడం లేదు అనడంతో వెంటనే పరంధామయ్య స్వార్థంతో ఆలోచిస్తే సమస్య ఎలా కనిపిస్తుంది అంటాడు.
 

అప్పుడు అంకిత ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినను అని అంటుంది. ఇంతలోనే తులసి అక్కడికి వస్తుంది. ఏంటి తులసి నిన్ననే కదా కెఫే విషయంలో అందరూ ఒక్కటిగా ఉండాలని చెప్పావు అనడంతో చెప్పాను కానీ ఇల్లు ముక్కలు చేస్తానని చెప్పలేదు కదా అంటుంది తులసి. అలాంటి పని ఎప్పటికీ జరగనివ్వను అనగా వేరే దారి లేదు కదా మామ్ అనడంతో ఉంది అని అంటుంది తులసి. అప్పుడు తులసీ ప్లాన్ మొత్తం వివరిస్తుంది. అప్పుడు సామ్రాట్ హెల్ప్ అంట తీసుకుంటావా నందు అనడంతో మాట సహాయం మాత్రమే డబ్బు సహాయం కాదు డబ్బు మీ ఆయనే కట్టుకోవాలి అంటుంది తులసి. అప్పుడు అభి మనసులో వేరే కాపురం పెట్టాలి అనుకుంటే ఇలా జరుగుతోంది ఏంటి అనుకుంటూ ఉంటాడు. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉంది. కేఫ్ స్టూడియో రెండు ఒకటే రోజే ప్రారంభం కావాలి అందరూ ఉన్నాం కదా అంటుంది.
 

 మీకు ఓకేనా అనగా ఓకే అని అంటాడు నందు. అదే వద్ద అంకిత రూమ్ సద్దుతూ ఉండగా ఓయ్ ఏంటిది బయటికి వెళ్దామని అన్నాను కదా పడుకుంటున్నావేంటి అంటాడు అభి. అప్పుడు అభి అంకిత పక్కన కూర్చోగా పక్కకు జరగడంతో ఏంటి అలా జరుగుతున్నావు అని అనగా పక్కకు జరిగితేనే నీకు అలా ఉందే మరి బంధాన్ని విడిచి ఇల్లు విడిచి వెళ్దాం అంటున్నావు అది ఎలా ఉంటుంది చెప్పు అభి అని నిలదీస్తుంది. అప్పుడు అభి మళ్లీ మొదటి నుంచి మాట్లాడడంతో నాకు ఇష్టం లేకపోయినా కార్పొరేట్ హాస్పిటల్ చేరడానికి ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు పదేపదే వేరే కాపురం గురించి మాట్లాడి ఎందుకు నన్ను విసిగిస్తావు అభి అని అంటుంది అంకిత. ప్లీజ్ అంకితం నన్ను నమ్ము ఇంట్లో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి మాత్రమే నేను ఓకే చెప్పాను అని అంటాడు అభి. అంకిత నువ్వు చెప్పినట్టే వింటాను ఇంకొకసారి ఆ టాపిక్ తీసుకురాను ఓకేనా సారీ అని అంటాడు. అప్పుడు అభి ఎలా అయినా నిన్ను ప్రేమగా దగ్గర చేసుకొని ఇంట్లో వాళ్లతో బంధం తెంపేస్తాను అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలసి కేఫె స్టార్ట్ చేయడానికి ఒక ప్రదేశానికి వెళ్లగా అక్కడ ఇల్లు చూసి ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు.

click me!