Guppedantha Manasu: జగతికి అసలు నిజం చెప్పిన వసుధార.. వసుధారకు స్వారీ చెప్పిన జగతి, మహేంద్ర?

First Published Feb 4, 2023, 7:57 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో జగతి కోపంతో ఏంటి మహేంద్ర ఇది. ఈ ఒక టాపిక్ తో మళ్ళీ రిషిని చిత్రవద పెట్టేలా ఉన్నారు. అసలు వసుకి బుద్ధి లేదు. రిషి ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటే వసు ఇలా చేస్తోంది అంటుంది జగతి. ఏదో ఒకటి చేయాలి అనడంతో ఏదో ఒకటి కాదు వసుధార దగ్గరికి వెళ్లి నిజం చెప్పమని నిలదీద్దాం అనడంతో వసుధార నిజం చెబుతుందని అనుకుంటున్నావా మహేంద్ర అంటుంది జగతి. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అనగా ఇంతలోనే మహేంద్ర జగతి ఆరోజు చక్రపాణి గారు ఈ విషయం చెప్పడానికి ఇంటికి వచ్చారేమో ఆడడంతో జగతి ఆలోచనలో పడుతుంది. అవును మహేంద్ర ఆయన కలిస్తే మనకు కచ్చితంగా నిజం తెలుస్తుంది వెళ్దాం పద అని అక్కడికి బయలుదేరుతారు. తర్వాత జగతి మహేంద్ర చక్రపాణి దగ్గరికి వెళ్లి మీతో మేము మాట్లాడాలి ఆ రోజు ఏం జరిగింది.

ఈ రోజు రాజీవ్ కాలేజీకి వచ్చి నానా రచ్చ చేశాడు పోలీసులు పట్టుకెళ్లారు అనడంతో చక్రపాణి షాక్ అవుతాడు. వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టకపోతే మరి ఎవరు కట్టారు అని అడుగుతుంది జగతి. అప్పుడు చక్రపాణి నిజం చెప్పబోతుండగా ఇంతలో వసుధార నేను చెబుతాను అని అక్కడికి వస్తుంది. అప్పుడు వసుధార జరిగింది మొత్తం వివరించడంతో జగతి మహేంద్రలు షాక్ అవుతారు. ఆరోజు మిమ్మల్ని వాడు చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తేనే నేను ఇలా చేశాను మేడంతో జగతి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఇది ఏంటి మేడం ఇది ఎవరిచ్చారు అనడంతో జగతి ఆలోచనలో పడుతుంది. నేను ఇచ్చాను వసుధార,  అది సరే నీ మెడలో తాళిబొట్టు ఎవరు కట్టారు అనడంతో ఇంకెవరు కడతారు అని మేడం రిషి సారే అనడంతో మహేంద్ర,జగతి ఇద్దరు షాక్ అవుతారు.
 

ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అనడంతో అవును మేడం ఇది రిషి సార్ కట్టాడు అని అనగా జగతి వాళ్ళు షాక్ లో ఉంటారు. నా చేతులతో నేనే ఈ తాళిబొట్టుని నా మెడలో వేసుకున్నాను కానీ మానసికంగా రిషి సార్ నా మెడలో వేసినప్పుడు నేను భావిస్తున్నాను అనడంతో జగతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నేను ఉన్న పరిస్థితులలో రాజీవ్ బావ నుంచి తప్పించుకోవడానికి నాకు అదే కరెక్ట్ అని అనిపించింది అందుకే ఇలా చేశాను మేడమ్ అనడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు వసు మొత్తం వివరించడంతో జగతి మహేంద్ర లు బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పటికైనా జరిగిన మొత్తం రిషికి చెప్పేయ్ వసు అని అంటుంది జగతి.
 

ఎందుకు వసుధార సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటున్నావు అనడంతో సమస్య కాదు సార్ ఇది మా ఇద్దరి జీవితాలు అంటుంది వసుధార. రిషి సార్ అంతట రిషి సార్ తెలుసుకోవాలి అంటుంది. అప్పుడు చక్రపాణి నువ్వు చెప్పు లేకపోతే మేము చెపుతాము అనగా వద్దు నాన్న అని అంటుంది వసుధార. నన్ను క్షమించు నాన్న నీ మీద నాకు గౌరవం ఉంది కానీ నాకు మధ్య ఎవరు సంప్రదింపులు జరపకూడదని అనుకున్నాను అంటుంది. రిషి సార్ నన్ను అపార్థం చేసుకున్నాడు. అపార్థంని రిషి సార్ తెలుసుకోవాలి అని అంటుంది వసుధార. ఇప్పుడు ప్రేమ మాకు పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో రిషి సార్ నన్ను గెలిపిస్తాడని నమ్మకం నాకు ఉంది అంటుంది వసుధార. అప్పుడు వసుధారని జగతి హత్తుకొని ఐ యామ్ స్వారీ వసుధార అని అంటుంది.

నేను రిషి సార్ లేకపోతే ఉండలేను అని అనుకున్నాను అలాగే నేను కూడా లేకపోతే రిషి సార్ ఉండలేడు అన్న నిజాన్ని తెలుసుకోవాలి అంటుంది వసుధార. అప్పుడు మీరు కూడా ఈ నిజాన్ని రిషి సార్ కి చెప్పొద్దు చెప్పాలంటే మా ప్రేమ మీద ఒట్టే అని వసుధార జగతితో ఒట్టు వేయించుకుంటుంది. ఆ తర్వాత రిషి ఒక చోట కూర్చుని జరిగిన విషయాలు తలుచుకొని అసలు వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టలేదు అన్నప్పుడు ఇంకెవరు కట్టారు నాకు తెలియకుండా వసుధార జీవితంలో ఇంకా ఎవరు ఉన్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే జగతి,మహేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు రిషి ఎంతో ఆశతో వసుధార మీకు ఏమైనా చెప్పిందా  మేడమ్ అని అడగగా నిజం తెలిసి కూడా చెప్పకుండా నేను ఉండలేను మహేంద్ర అనడంతో చెప్తే ఏం జరుగుతుంది.

తన బాధ నేను చూడలేకపోతున్నాను వసు మాటకంటే రిషి ప్రేమే ముఖ్యం అని అంటుంది జగతి. అప్పుడు మేడం వసుధార చెప్పకపోతే మీదేనా అడగాలి కదా అనగా వసుధార ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి రిషి అంటూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతుంది జగతి. అవును రిషి కాలేజీ విషయాలు వేరు పర్సనల్ విషయాలు వేరు వాటిని కలపద్దు అని నువ్వే అన్నావు కదా అంటుంది జగతి. ఇంతలోనే దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు దేవయాని దొంగ ప్రేమలు కురిపిస్తూ ఉండగా మహేంద్ర సెటైర్లు వేస్తూ ఉండడంతో జగతి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు జగతి మహేంద్ర కూడా అనుగుణంగా మాట్లాడడంతో ఏం జరుగుతుందో అర్థం కాక దేవయాని అయోమయంలో ఉంటుంది.

అప్పుడు జగదీ ఏమి తెలియనట్టుగా ఆ వసుధారను తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది అనడంతో నువ్వే నా జగతి ఇలా మాట్లాడుతోంది అనగా నేనే అక్కయ్య అని అంటుంది. అప్పుడు జగతి ఎక్కడ నుంచి వెళ్తూ అక్కయ్య ఇంకొకసారి మీరు ఆ వసుధార పేరు ఎత్తకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి. తర్వాత జగతి,మహేంద్ర రూమ్ లోకి వెళ్లి జరిగిన విషయాలు తలుచుకొని రిషి బాదని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి ఈ విషయంలో దేవయాని అక్కయ్య హస్తం కూడా ఉంటుంది అని అనగా నిజమా జగతి అని అంటాడు మహేంద్ర. తన పెత్తనం కోసం ఎంతకైనా దిగజారుతుంది ఎంతకైనా తెగిస్తుంది అంటుంది జగతి. అప్పుడు వాళ్ళిద్దరూ రిషి ని తలుచుకుని  బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!