Intinti gruhalakshmi: తులసి కండిషన్లకు ఒప్పుకున్న సామ్రాట్.. ప్రేమ్ డైరీ చదివిన అంకిత?

Published : Aug 01, 2022, 10:36 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ (Intinti Gruhalakshmi) మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు  ఆగస్ట్ 1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

PREV
16
Intinti gruhalakshmi: తులసి కండిషన్లకు ఒప్పుకున్న సామ్రాట్.. ప్రేమ్ డైరీ చదివిన అంకిత?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... తులసి ఈ ప్రాజెక్టు నాకు నచ్చలేదు.నాకు కేవలం సంగీతానికి మాత్రమే కావాలి కానీ ఇక్కడ సంగీతం క్లాస్ తో పాటు కాంప్లెక్స్ లు , ఆఫీసులు అన్నీ కలిపి కడుతున్నారు అది నాకు ఇష్టం లేదు అని నందుకు చెబుతుంది. "సంగీతం స్కూల్ అంటే అది చాలా ప్రశాంతంగా ఉండాలి కాని ఇలా అన్నిటి మధ్య ఉండకూడదు".అని చెప్పి నందుని, లాస్యని అక్కడి నుంచి పంపించేస్తుంది తులసి. 
 

26

నందు లాస్య కారులో వెళుతూ తులసి గురించి తిట్టుకుంటూ ఉంటారు."తను నీ భార్య తులసి కాదు,అణిగిమణిగి  ఉండే ఒకప్పటి తులసి కాదు, ఇప్పుడు చాలా ముదిరిపోయింది, తలుచుకుంటే మన ఉద్యోగాలు పీకే స్థాయికి వచ్చింది, కావాలనే మనల్ని ఇలా రెచ్చగొడుతుంది నువ్వు రెచ్చిపోతే మన జాబే  ఊడిపోతుంది". అని లాస్య నందుకు చెబుతుంది. ఆ తర్వాత సీన్లో ప్రేమ్ శృతిని తలుచుకుంటూ "నువ్వు పని మనిషిగా ఉంటుందందుకు నేను బాధపడలేదు శృతి,

36

కానీ నిన్ను అడ్డంపెట్టి  బాస్ నన్ను తిట్టినందుకు తాగిన మత్తులో నోరు జారాను. అందుకని అర్ధరాత్రి నన్ను వదిలి వెళ్ళిపోవాలా?తర్వాత రోజు చొక్కా పట్టుకొని ఎందుకు ఇలా చేశావు? అని నిలదీయాల్సింది కదా" అని బాధపడుతూ డైరీ లో రాస్తాడు  ప్రేమ్. అటువైపు శృతి ప్రేమ్ కి తన మీద ప్రేమ తగ్గిపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంతటిలో ప్రేమ్ వాళ్ళ వదిన "తాతయ్య పిలుస్తున్నార" అని చెప్పి ప్రేమ్ ని వెళ్ళమని చెబుతుంది. 
 

46

ప్రేమ్ రూము చూసి శృతి లేకపోతే ఇంత అసహ్యంగా పెడతావా? నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి గది సద్దుతూ ఉండగా ప్రేమ్ రాసిన డైరీ ని చదువుతాది. చదివి ఆశ్చర్యపోయి కన్నీళ్లు పెట్టుకుంటాది.తర్వాత సీన్ లో తులసి సామ్రాట్ దగ్గరకు వస్తుంది. నందు లాస్యలు "తులసి గారికి ప్రాజెక్ట్ నచ్చలేదంట,అక్కడ కేవలం సంగీతం క్లాస్ మాత్రమే ఉండాలట, ఇలాగైతే మనం లాభాలను కోల్పోతాము" అని అంటారు. సామ్రాట్ మాత్రం తులసి చెప్పినదంతా విని అర్థం చేసుకొని, 

56

తులసి గారు ఏం చెప్తే అదే చేయండి అని చెప్తాడు. తులసి ఎంతో సంతోషిస్తుంది. లాస్య నందులు ఆశ్చర్యపోతారు.తర్వాత సీన్ లో ప్రేమ్ వాళ్ళ వదిన, ప్రేమ్ కి ఆ డైరీ ఇచ్చి, "చదవడం తప్పే కానీ నీ బాధ చూసి అవకాశం దొరికిందని చదివాను ,నన్ను క్షమించు". అని చెప్పి నీకు అభి లాగ కోపం ఎక్కువ కానీ అభి కోపంలో న్యాయం ఉండదు, నీ కోపంలో న్యాయం ఉంటుంది. అయినా శృతికి ఎందుకు ఇలా చేశావు అని అడగగా 
 

66

"నన్ను నేనేం సమర్ధించుకోవట్లేదు కానీ నన్ను క్షమించు అని అడిగే అవకాశం కూడా శృతి నాకు ఇవ్వలేదు" అని బాధపడతాడు . ఎప్పటికైనా శృతి వస్తుందిలే అని ధైర్యం చెబుతుంది ప్రేమ్ వాళ్ళ వదిన. ఆ తర్వాత హనీ ఇంట్లో దీనంగా కూర్చుని ఉండగా ఏమైంది అని సామ్రాట్ అడుగుతాడు. ఈ ఇల్లు జీవం లేని ఇల్లుల ఉంది అని అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories