నో మేకప్.. నేచురల్ అందంతో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ హీరోయిన్!

First Published Sep 4, 2021, 5:27 PM IST

తెలుగుతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి గుర్తుందిగా. తాన్ గ్లామర్ తో పాటు నటనతో పలు చిత్రాల్లో మెప్పించింది ఈ భామ. 

తెలుగుతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి గుర్తుందిగా. తాన్ గ్లామర్ తో పాటు నటనతో పలు చిత్రాల్లో మెప్పించింది ఈ భామ. 

తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు కానీ ఈ జంటకు ప్రేక్షకుల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

ఎన్టీఆర్, సమీరా రెడ్డిపై అప్పట్లో అనేక వార్తలు కూడా వచ్చాయి. ఇక సమీరా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా చిత్రంలో గ్లామర్ ఒలకబోసింది. సమీరా రెడ్డి వెండి తెరపై బాగానే అందాలు ఆరబోసింది. అందుకే యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. 

ఇక సమీరా రెడ్డి వివాహం తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. సమీరా చివరగా తెలుగులో కృష్ణం వందే జగద్గురం చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. 

ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ అక్షయ్ వర్దెని సమీరా రెడ్డి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. గర్భంతో ఉన్న సమయంలో మహిళలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటూ సమీరా రెడ్డి బికినిలో సాహసోపేతంగా అండర్ వాటర్ ఫోటోషూట్స్ తో హాట్ టాపిక్ గా నిలిచింది. 

ప్రస్తుతం సమీరా రెడ్డి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమీరా మేకప్ లేకుండా తన నేచురల్ అందంతో ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ పిక్స్ వైరల్ గా మారాయి. 

click me!