అచ్చుగుద్దినట్లు 'అమ్మ'లా దిగిపోయింది.. జయలలిత మెమోరియల్ ఘాట్ వద్ద కంగనా రనౌత్

pratap reddy   | Asianet News
Published : Sep 04, 2021, 01:49 PM IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఫిమేల్ లీడ్ గా జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
16
అచ్చుగుద్దినట్లు 'అమ్మ'లా దిగిపోయింది.. జయలలిత మెమోరియల్ ఘాట్ వద్ద కంగనా రనౌత్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఫిమేల్ లీడ్ గా జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

 

26

బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

 

36

ఈ చిత్రంలో జయలలిత చిత్ర పరిశ్రమలో రాణించిన విధానం, రాజకీయాల్లో పోరాటం, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె సేవలు, చివరకు మరణం లాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 

46

ఇప్పటికే ఈ చిత్రంలో కంగనా లుక్స్ ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ లో క్వీన్ గా, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనా.. జయలలిత లాంటి మాస్ పొలిటికల్ పర్సన్ పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. తమిళనాట జయలలితన అమ్మగా ఎలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. 

56

రిలీజ్ కు టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. దీనికోసం కంగనా నేడు చెన్నైకి వెళ్ళింది.  ప్రచార కార్యక్రమాలు ప్రారంభించే ముందు జయలలిత మెమోరియల్ ఘాట్ వద్ద కంగనా నివాళులు అర్పించింది. 

66

ఈ సందర్భంగా కంగనా మేకోవర్ ప్రతిఒక్కరిని ఆకర్షిస్తోంది. జయలలితని తలపించే విధంగా ఆమె కట్టు బొట్టు ఉంది. నారింజ రంగులో ఉన్న నిండైన చీరలో కంగన మెరుపులు మెరిపిస్తోంది. 

click me!

Recommended Stories