దానికోసం నా బాడీ మొత్తం మేకప్ వేశారు, తన కెరీర్ లో చీకటి కోణాన్ని బయట పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్

Published : Mar 08, 2026, 09:35 PM IST

కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న దారుణమైన అనుభవాలను సమీరా రెడ్డి పంచుకున్నారు. తెల్లగా కనిపించడం కోసం ఒళ్లంతా మేకప్ వేయించుకోవాల్సి వచ్చేదని, తన టాలెంట్ కంటే రంగు, శరీరాకృతి గురించే ఎక్కువగా మాట్లాడేవారని బాలీవుడ్ చీకటి కోణాన్ని బయటపెట్టారు.

PREV
18
గ్లామర్ వెనుక ఎన్నో చేదు నిజాలు

రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీలో పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చేదు నిజాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో హీరోయిన్లు ఎప్పుడూ అందంగా, తెల్లగా, సన్నగా ఉండాలనే ఓ రూల్ దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు ఈ 'టాక్సిక్ బ్యూటీ నార్మ్స్' (విషపూరిత సౌందర్య ప్రమాణాలు) పై నటి సమీరా రెడ్డి ఫైర్ అయ్యారు.

28
తెల్లగా కనిపించాలని ఎప్పుడూ ఒత్తిడి ఉండేది
కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకుంటూ, 'ఒక నటిగా నేను తెల్లగా కనిపించాలని ఎప్పుడూ ఒత్తిడి ఉండేది. మేకప్ వాళ్లు నా స్కిన్ టోన్ కంటే తెల్లటి మేకప్ వేసేవాళ్లు' అని సమీరా చెప్పారు.
38
రీరం మొత్తానికి మేకప్
కేవలం ముఖానికే కాదు, నా శరీరం మొత్తానికి బాడీ మేకప్ వేసేవాళ్లు. అది నాకు చాలా ఇబ్బందిగా, అవమానంగా అనిపించేది' అని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు.
48
రంగు గురించే చర్చలు
'నేను పొడవుగా ఉండటంతో చాలా పెద్దగా ఉన్నావని హేళన చేసేవాళ్లు. నా నటన, టాలెంట్ గురించి కాకుండా నా శరీర కొలతలు, రంగు గురించే చర్చలు జరిగేవి. అప్పుడు వ్యతిరేకించే ధైర్యం లేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే అసహ్యం వేస్తోంది' అని బాలీవుడ్‌పై మండిపడ్డారు.
58
సమీరా రెడ్డి సోషల్ మీడియాలో..
సినిమాలకు దూరమయ్యాక సమీరా రెడ్డి సోషల్ మీడియాలో 'మెస్సీ మామా' (Messy Mama)గా ఫేమస్ అయ్యారు. తల్లయ్యాక వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. 'మొదటి బిడ్డ పుట్టాక బరువు పెరగడంతో ఒంటరినయ్యాను' అని చెప్పారు.
68
నా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది
'ప్రజలు నన్ను జడ్జ్ చేసేవాళ్లు. దానివల్ల నా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. కానీ రెండో బిడ్డ నైరా పుట్టాక, ఇలాంటి బాధ మరెవరూ పడకూడదని నిర్ణయించుకున్నా' అని సమీరా తెలిపారు.
78
ట్రోల్స్ అంటే నాకు భయం లేదు
సమీరా తన నెరిసిన జుట్టు (Grey Hair), మేకప్ లేని సహజమైన చర్మంతో ఫోటోలు షేర్ చేసినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. 'నువ్వు అమ్మవయ్యావ్, లావయ్యావ్, నీ సినీ కెరీర్ ముగిసింది అన్నారు. దాన్నే నేను సవాలుగా తీసుకున్నా. ఇప్పుడు ట్రోల్స్ అంటే నాకు భయం లేదు' అని ఆమె గట్టిగా సమాధానమిచ్చారు.
88
సమీరా రెడ్డి చివరిసారిగా..

నేటి తల్లిదండ్రులు పిల్లల మార్కుల కంటే వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. లింగ సమానత్వం, బుల్లీయింగ్ (Bullying), సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు. సమీరా రెడ్డి చివరిసారిగా కన్నడ చిత్రం 'వరదనాయక'లో కనిపించారు. కిచ్చా సుదీప్, చిరంజీవి సర్జా నటించిన ఈ చిత్రంలో సమీరా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా, మహిళలకు స్ఫూర్తినిస్తూ సమీరా రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.సమీరా రెడ్డి తెలుగులో ఎన్టీఆర్ కి జోడీగా నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆ సమయంలో ఎన్టీఆర్, సమీరా గురించి రూమర్స్ కూడా వచ్చాయి. అదే విధంగా ఆమె చిరంజీవితో జై చిరంజీవ చిత్రంలో నటించింది.

Read more Photos on
click me!

Recommended Stories