జిమ్‌లో హాట్‌గా వర్కౌట్‌ చేస్తూ దుమ్ము రేపుతున్న సమంత.. ఆ అనుభవాలు పంచుకుంటూ పోస్ట్

Published : May 25, 2022, 10:59 PM ISTUpdated : May 26, 2022, 06:13 AM IST

సమంత అందాల ఆరబోతలో ఎంతగా రెచ్చిపోతుందో, ఫిట్‌నెస్‌ విషయంలో అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ విషయంలో తగ్గేదెలే అని చాటుకుంటోంది. నిత్యం వర్కౌట్‌లో బిజీగా గడుపుతుంది సామ్‌.   

PREV
17
జిమ్‌లో హాట్‌గా వర్కౌట్‌ చేస్తూ దుమ్ము రేపుతున్న సమంత.. ఆ అనుభవాలు పంచుకుంటూ పోస్ట్

సమంత ఫిట్‌నెస్‌ విషయంలో ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంటారు. ఆమెని చూసి ఇప్పుడొస్తున్న కథానాయికలు, స్టార్‌ హీరోయిన్లు సైతం ఇన్‌స్పైర్‌ అయ్యేట్టుగా కష్టపడుతుంది. బాడీని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకుంటోంది. తాను ఎక్కడున్నా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌నెస్‌ని చాటుకుంటోంది. బాడీని యాక్టివ్‌గా ఉంచుకుంటోంది. 
 

27

చలాకీ తనంతోపాటు ఆమె ఫిట్‌గా ఉండటంతో వర్కౌట్స్ కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమంత ఆ విషయంలో రాజీపడకుండా ఉంటుంది.లేటెస్ట్ గా ఆమె జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని పంచుకుంది. తన ట్రైనర్‌ జునైద్‌ షేక్‌ సారథ్యంలో తను వర్కౌట్‌ చేస్తుంది సమంత. ఈ విషయాన్ని పంచుకుంది. 

37

వర్కౌట్‌ డ్రెస్‌లో సమంత కేకపెట్టిస్తుంది. బలమైన ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ దుమ్మురేపుతుంది. అయితే తాను సినిమాల షూటింగ్‌లో పాల్గొనేందుకు, యాక్షన్‌ చేసేందుకు ఇవి ఎంతో ఉపయోపడతాయని, గత కొన్ని నెలలుగా తాను ఇలా వర్కౌట్‌ చేస్తున్నానని, ఇప్పుడు ఈజీ అవడం వెనకాల చాలా కష్టం ఉందని చెప్పింది సమంత. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది.
 

47

మరోవైపు ఆమె వర్కౌట్‌ చేస్తున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోగా అది ట్రెండింగ్‌ అవుతుంది. సమంత ఆ మధ్య ఫిట్‌నెస్‌కి సంబంధించిన అనేక విషయాలను కూడా పంచుకుంది. తాను స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు, మానసికంగ్‌ లోగా ఉన్నప్పుడు ఇలాటి వర్కౌట్స్ ఎంతో రిలీఫ్‌నిస్తాయని, మానసికంగా ధైర్యాన్నిస్తాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపింది సమంత. 

57

ప్రస్తుతం తెలుగు నుంచి ఇంటర్నేషనల్‌ వరకు పలు సినిమాలో బిజీగా ఉంది సమంత. `యశోద`, `శాకుంతలం`, `ఖుషి`తోపాటు ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తుంది. అలాగే మరో బైలింగ్వల్ సినిమా చేయాల్సి ఉంది. మరికొన్ని సినిమాలు ఆమె సైన్‌ చేయాల్సి ఉంది. 
 

67

ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్‌ పరంగా సమంత రెచ్చిపోతున్న విసయం తెలిసిందే. పొట్టి దుస్తులు, పొదుపైన దుస్తులు ధరించి అందాల విందు వడ్డిస్తుంది. అంతకు ముందు కంటే ఆ తర్వాతే డోస్‌ పెంచుతుంది. తన గ్లామర్‌లోని కొత్త యాంగిల్స్ ని చూపిస్తూ నెటిజన్లని, ఫ్యాన్స్ ని రెచ్చగొడుతుంది. 
 

77

అదే సమయంలో తనకు నచ్చిన పని చేస్తుంది. నచ్చిన విధంగా స్వేచ్ఛగా జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. తాను చేయాలనుకుంటున్న పనిని చేస్తుంది. నిజంగా అసలైన జీవితాన్ని సమంత ఇప్పుడు అనుభవిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. వరుస సినిమాలతోనూ దూసుకుపోతూ తానేంటో చాటుకుంటుంది. సెన్సేషన్‌ అవుతుంది సమంత. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories