అక్కడ సమంత విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను చదువుకునే రోజుల్లో మా అమ్మా, నాన్న నన్ను కష్టపడి చదిచాలని, పెద్దదాన్ని చేయాలని భావించారు. నేనూ కష్టపడి చదివాను. 10వ తరగతి, 12వ తరగతిలో కాలేజీ టాపర్‌గా రాణించాను. కానీ ఉన్నత విద్యనభ్యసించేందుకు మా తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో నా కలలకు గమ్యం లేదు. భవిష్యత్ కూడా లేదు. ’ అంటూ చెప్పింది.