సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు గౌతమ్ మీనన్ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలంటే పిచ్చి. తను ఎలా ఉంటాడో చూద్దామని ఆడిషన్‌కి వెళ్లిందట. కానీ అనూహ్యంగా హీరోయిన్‌గా ఎంపికైనట్టు చెప్పింది సమంత.
`ఏం మాయ చేసావె` సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసింది. ఆడిషన్‌కి వెళితే ఆ దర్శకుడిని కలిసే అవకాశం వస్తుందని సమంత భావించింది. ఆయన్ని చూసి వస్తే చాలు అనుకుందట.
హీరోయిన్ అవ్వాలని, తాను సెలక్ట్ కావాలని అస్సలు ఊహించలేదు. తన మైండ్ లో కూడా లేదు. కానీ ఆడిషన్ చేశాక హీరోయిన్‌గా ఎంపికయ్యావని చెప్పారట.
దెబ్బకి షాక్ అయినట్టు చెప్పింది సమంత. `ఏం మాయ చేసావె` రిలీజ్ తర్వాత సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది.