Krishnamraju-Jamuna: జమునకి మొగుడు దొరకలేదని హీరోని చేశారు.. కృష్ణంరాజు కెరీర్‌లో బిగ్‌ టర్న్, ఇంత విచిత్రంగానా?

Published : Jul 08, 2025, 07:45 AM ISTUpdated : Jul 08, 2025, 07:47 AM IST

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. దానికి అప్పటి రెబల్‌ హీరోయిన్‌ జమున కారణం కావడం విశేషం. 

PREV
15
విలన్‌గా కెరీర్ ప్రారంభించిన కృష్ణంరాజు హీరోగా మారిన సందర్భం

రెబల్‌ స్టార్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష గుర్తింపు పొందారు కృష్ణంరాజు. విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరోగా టర్న్ తీసుకుని రెబల్‌ స్టార్‌గా పాపులర్‌ అయ్యారు. 

ఇప్పటికీ ఆయన్ని అంతా రెబల్‌ స్టార్‌గానే పిలుస్తున్నారు. ఆవేశంతో కూడిన, కోపంతో కూడిన పాత్రలతో, యాక్షన్‌ సినిమాలతో ఆయనకు రెబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ వచ్చిందనే విషయం తెలిసిందే. 

అయితే కృష్ణంరాజు విలన్‌గా కెరీర్‌ ని ప్రారంభించగా, హీరోగా ఎలా మారారు, దాని వెనకాల ఏం జరిగిందనేది చూస్తే.

25
`చిలకాగోరింక` మూవీతో కృష్ణంరాజు ఎంట్రీ

కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ. వారి తాతల కాలంలో రాజులుగా ఉండేవారు. అయితే కృష్ణంరాజుకి నాటకాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చారు. 

`చిలకాగోరింక` చిత్రంతో నటుడిగా మారారు. తొలి చిత్రంలోనే లీడ్‌ రోల్‌ చేశారు. పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఈ లోపు ఇతర చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్‌, కృష్ణ సినిమాల్లో కీలక పాత్రల్లో, నెగటివ్‌ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. 

1973లో వచ్చిన `ఇంటిదొంగలు` మూవీతో ఆయన హీరోగా టర్న్ తీసుకున్నారు. కెరీర్‌ ప్రారంభించిన ఆరేడు ఏళ్ల వరకు విలన్‌గా, క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. మధ్య మధ్యలో అడపాదడపా లీడ్‌గా కనిపించినా అవి ఆడలేదు.

35
`ఇంటిదొంగలు` చిత్రంతో హీరోగా కృష్ణంరాజు ఎంట్రీ

ఈ క్రమంలో ఆయన పూర్తి స్థాయి హీరోగా మారిన మూవీ `ఇంటి దొంగలు`. ఇందులో జమున హీరోయిన్‌. ప్రత్యగాత్మ సోదరుడు కె హేమాంభరధర రావు దర్శకత్వం వహిస్తూ నిర్మించారు.

 ఇది హీరోయిన్‌ పాత్ర ప్రధానంగా సాగే మూవీ. ఇందులో జమున మొగుడి పాత్ర చాలా కీలకం. ఆమెకి జోడీగా చేసేందుకు ఏ హీరో ఓకే చెప్పలేదు. పెద్ద హీరోలంతా తిరస్కరించారు. 

దీంతో చివరికి విలన్‌గా చేస్తున్న కృష్ణంరాజు వద్దకు వెళ్లింది. దర్శకుడు హేమాంభరధర రావు రెబల్‌ స్టార్‌ని అడిగారు. ఇందులో లీడ్‌గా చేస్తావా? అని. 

లోపలు జమునతో అంటే ఒక జంకు ఉంది. కానీ హీరో పాత్ర కావడంతో ఆ ఉత్సాహంతోనే ఓకే చెప్పేశారు రెబల్‌ స్టార్‌. అలా `ఇంటి దొంగలు` సినిమాతో హీరో అయిపోయారు కృష్ణంరాజు.

45
కోపంతో కూడిన పాత్రలు, యాక్షన్‌ చిత్రాలతో రెబల్‌ స్టార్‌గా మారిన కృష్ణంరాజు

అట్నుంచి హీరోగా టర్న్ తీసుకుని ఇక వరుసగా హీరోగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. హీరోగా చేసినా, కృష్ణతో, శోభన్‌ బాబుతో, రామారావు, ఏఎన్నార్‌లతో కలిసి చాలా సినిమాలు చేశారు. కానీ హీరోగా మూవీస్‌ని కంటిన్యూ చేశారు. 

ఆ తర్వాత `కృష్ణావేణి`, `పరివర్తన`, `భక్త కన్నప్ప`, `కురుక్షేత్రం`, `అమరదీపం`, `జీవనతీరాలు`, `సతీ సావిత్రి`, `కటకటాల రుద్రయ్య`, `మనవూరి పాండవులు`, `రంగూన్‌ రౌడీ`, `సీతా రాములు`, `బెబ్బులి`, `ప్రేమ తరంగాలు`, 

`ఆడవాళ్లు మీకు జోహార్లు`, `అగ్నిపూలు`,`రగిలే జ్వాల`, `మధుర స్వప్నం`, `త్రిశూలం`, `ధర్మాత్ముడు`, `బొబ్బిలి బ్రహ్మన్న`, `తాండ్ర పాపారాయుడు`, `సర్దార్‌ ధర్మన్న`, `కిరాయి దాదా`, `అంతిమ తీర్పు` వంటి చిత్రాలతో మెప్పించారు. సూపర్‌ స్టార్‌గా ఎదిగారు.

55
మహిళా ప్రధాన చిత్రాలకు కృష్ణంరాజు పెద్ద పీఠ

రెబల్‌ స్టార్‌ ఆవేశంతో కూడిన పాత్రలు, అలాంటి యాక్షన్‌ చిత్రాలే కాదు, మహిళా ప్రధానమైన సినిమాలు కూడా చేశారు. అలాంటి చిత్రాలకు ప్రయారిటీ ఇచ్చారు. 

హీరోయిజంతోనే కాదు ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే చిత్రాలను నిర్మించారు. సినిమా కథల్లో మార్పుకు దోహదపడ్డారు. అలాంటి కథలను ఎంకరేజ్‌ చేశారు. నిర్మాతగా తన టేస్ట్ ని చాటుకున్నారు.

 రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు.. ప్రభాస్‌కి పెదనాన్న అనే విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా ప్రభాస్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నారు.

 ఇప్పుడు పాన్‌ ఇండియా దాటి పాన్‌ వరల్డ్ స్టార్‌గా ఎదుగుతున్నారు. కృష్ణంరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories