పింక్ శారీలో మరింత ఘాటుగా.. సామ్ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

First Published | Oct 10, 2023, 1:40 PM IST

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. పద్ధతిగా చీరకట్టులో మెరిసినా మతులు పోయేలా ఫోజులిచ్చింది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన గురించి అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 
 

ఈ ఏడాది మయోసైటిస్ బారిన పడిన పడ్డ స్టార్ హీరోయిన్ కొన్ని నెలల పాటు చికిత్స  తీసుకుంది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. కంప్లీట్ రెస్ట్ తీసుకుంటోంది. పుణ్య క్షేత్రాలు, బ్యూటీఫుల్ లోకేషన్లకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. 
 


మరోవైపు సమంత పలు ఈవెంట్లకూ హాజరవుతోంది. రీసెంట్ దుబాయ్ లో ఓ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సామ్ పింక్ శారీలో అదిరిపోయేలా దర్శనమిచ్చింది. చీరకట్టులతో బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. అలాగే గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది.

గతంలో సామ్ చేసిన ఫొటోషూట్లు ఎంతసెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇక తాజాగా పంచుకున్న ఫోటోలు కూడా ఆ మాదిరిగానే కనిపిస్తున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరలో అందాల విందు చేసింది. సైడ్ యాంగిల్లో మతులు పోయేలా ఫోజులిచ్చి చూపుతిప్పుకోకుండా చేసింది.
 

సామ్ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతుండగా.. తాజాగా మరింత ఘాటుగా ఇలా దర్శనమిచ్చింది. ప్రస్తుతం పిక్స్ ను ఫ్యాన్స్ , నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. చాలా రోజుల తర్వా త సామ్ ఇలా దర్శనమివ్వడంతో స్టన్ అవుతున్నారు. 
 
 

ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ చిత్రం విడుదలైంది. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నెక్ట్స్  హిందీలో క్రేజీ సిరీస్ Citadel ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తైనట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!