బ్లాక్ శారీలో కొట్టొచ్చినట్టు కనిపించేలా అందాలు.. మిర్నా మీనన్ నెమ్మదిగా గ్లామర్ విందు చేస్తోందిగా..

First Published | Oct 10, 2023, 12:36 PM IST

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత మరింతగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ దర్శనమిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon)  ఇప్పటికే తెలుగులో చిత్రాలతో టాలీవుడ్ లో సందడి చేసింది. ఆది సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలతో నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ పెద్ద ఫలితాన్ని అందుకోలేకపోయింది.  
 

ఇక రీసెంట్ గా కోలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జైలర్’ (Jailer)తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. జైలర్ కోడలి పాత్రలో పద్ధతిగా మెరిసి, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించింది. దీంతో తమిళ ఆడియెన్స్ కే కాదు తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది.
 


వెండితెరపై ఇలా అలరిస్తూనే వస్తున్న మీర్నా మీనన్ ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో పాటు చీరకట్టులో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. 

తాజాగా మీర్నా మీనన్ బ్లాక్ శారీలో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే గ్లామర్ షోతోనూ అట్రాక్ట్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో అందాల ప్రదర్శన చేసింది. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో మెస్మరైజ్ చేసింది.
 

తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. ఈ బ్యూటీతోనే మీర్నా తెలుగులో ఒక్క సినిమా పడితే అదరగొట్టడం ఖాయమంటున్నారు. హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగానే మీర్నా మీనన్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. 

ఇప్పటికే తెలుగు దర్శకనిర్మాతల కన్ను తనపై పడేలా చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జున లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామీరంగ’ చిత్రంలో మీర్నా మీనన్ కు అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ వరుస ఆఫర్లు ఖామంటున్నారు. 

Latest Videos

click me!