విడాకుల తర్వాత తన లైఫ్ లో ఏం జరిగిందో చెప్పిన సమంత.. హృదయాన్ని కదిలించే విషయాలు వెల్లడి

Published : Apr 02, 2023, 03:12 PM ISTUpdated : Apr 02, 2023, 04:52 PM IST

సమంత కోలుకున్నట్టే అని అంతా భావిస్తున్నారు. ఆమె వరుస సినిమాల్లోనూ నటిస్తున్న నేపథ్యంలో సమంత ఈజ్‌ బ్యాక్‌ అని అనుకుంటున్నారు. కానీ తాను ఇంకా ఆ గతాన్ని మర్చిపోలేకపోతుందట.

PREV
17
విడాకుల తర్వాత  తన లైఫ్ లో ఏం  జరిగిందో చెప్పిన సమంత..  హృదయాన్ని కదిలించే విషయాలు వెల్లడి

సమంత ఒక ఆదర్శమైన మహిళ, ఆమె ఒక పోరాట యోధురాలు, సమంత.. ఒక బలమైన నాయిక.. విడాకుల తర్వాత, మయోసైటిస్‌ వంటి అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత గురించి వినిపించే మాట ఇది. నిజమే సమంత కి వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక మహిళ జీవితంలో విడాకుల ఘటన అత్యంత బాధాకరమైన, విచారకరమైన విషాదకరమైన ఘటన. దాన్ని సమంత ఫేస్‌ చేసింది. దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించే క్రమంలోనే ఆమెని మయో సైటిస్‌ అనే అరుదైన వ్యాధి వెంటాడింది. కొన్ని నెలలపాటు వెంబడించింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంది. 
 

27

ఇప్పుడు తిరిగి మామూలు మనిషిలా తయారైంది. రెగ్యూలర్‌గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మానసికంగా, శారీరకంగా బలంగా తయారవుతుంది. సమంత కోలుకున్నట్టే అని అంతా భావిస్తున్నారు. ఆమె వరుస సినిమాల్లోనూ నటిస్తున్న నేపథ్యంలో సమంత ఈజ్‌ బ్యాక్‌ అని అనుకుంటున్నారు. కానీ తాను ఇంకా ఆ గతాన్ని మర్చిపోలేకపోతుందట. విడాకుల ఘటన తనని ఇంకా వెండాతుందని చెప్పింది సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది షాకిచ్చింది. విడాకుల ఘటన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న అనేక ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకుంది. 
 

37

ఇందులో సమంత చెబుతూ, పూర్తిగా ఆ చీకటి రోజులను మర్చిపోలేకపోతున్నానని చెప్పింది. తాను ఇండిపెండెంట్‌ ఉమెన్‌ అని, బలమైన మహిళగా అందరు అభివర్ణిస్తున్నారు, కానీ తనని తాను అలా అనుకోవడం లేదని తెలిపింది సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎన్నో కన్నీళ్లు, కష్టాలు, బాధలను చూశానని చెప్పింది. నాకు మంచే జరుగుతుందా అని తరచూ అమ్మని అడుతూ ఉండేదట. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చీకటి రోజులు చూశానని వెల్లడించింది సమంత. 

47

ఆ సమయంలో తనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండేవట. ఆ ఆలోచనలు తనని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా, ముందుకు అడుగు వేశా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తన వెంటనే ఉన్నారని, వాళ్ల వల్లే తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు చెప్పింది సమంత. ఆ సమయంలో తనకు మనసుకు అనిపించింది చేశానని, ఏం చేస్తున్నాననో తనకే అర్థం కాలేదని వెల్లడించింది. ఆ క్లిష్టసమయంలో తనకు అండగా నిలిచి ధైర్యాన్ని నింపిన వారికి ధన్యవాదాలు తెలిపింది సమంత. 

57

కానీ ఇప్పటికీ ఆ చీకటి రోజులను, చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నట్టు వెల్లడించింది సామ్‌. ఆ బాధ నుంచి ఇంకా పూర్తిగా కోలేకోలేదని పేర్కొంది. ముందుతో పోల్చితే చీకటి రోజులు తగ్గాయని వెల్లడించింది. క్లిష్టమైన పరిణామాలు ఎదుర్కొన్న తర్వాతే మనలోని ధైర్యం పెరుగుతుందని, ఎప్పటికీ ఆ క్షణాలు అలాగే ఉండిపోవని తెలుసుకోవాలని చెప్పింది సామ్‌. ఇక మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన నాటి రోజు తలుచుకుంటేనే భయమేస్తుందని, తనకు అంతటి ధైర్యం ఎలా సాధ్యమో అర్థం కాలేదని చెప్పింది సమంత. 

67

సమంత ఎంతగానో ప్రేమించి హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. పెద్దల అగీకారంతో 2017 అక్టోబర్‌ 6న వీరి వివాహం జరిగింది. దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్నారు. అంతేకాదు ఆదర్శ జంటగానూ నిలిచారు. కానీ అనూహ్యంగా వీరిద్దరు విడిపోతున్నట్టు రూమర్స్ స్ప్రెడ్‌ అయ్యాయి. రెండు మూడు నెలలకే డైవర్స్ ని ప్రకటించారు. ఆ తర్వాత దాన్నుంచి కోలుకునే ప్రాసెస్‌లో సమంత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడింది. దీంతో దాదాపు నాలుగైదు నెలలు పోరాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంది. 

77

ప్రస్తుతం సమంత `శాకుంతలం` చిత్రంలో నటించింది. ఇది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. మైథలాజికల్‌ కథాంశంతో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా గడుపుతుంది సమంత. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది సామ్‌, అలాగే హిందీలో `సిటాడెల్` వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో నటిస్తుంది. తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories