సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. గత ఏడాది ఆమె నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. శాకుంతలం డిజాస్టర్ కాగా, ఖుషి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. తర్వాత ఆమె విరామం తీసుకున్నారు. కమిట్మెంట్స్ కి దూరంగా కొన్నాళ్ళు విదేశాల్లో విహరించారు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత అమెరికా ట్రీట్మెంట్ కి వెళ్లారని కథనాలు వెలువడ్డాయి.