సమంత రెండో పెళ్లికి రెడీ?.. పేరెంట్స్ ఒత్తిడి మేరకు గ్రీన్ సిగ్నల్?

Published : Feb 07, 2024, 11:03 PM ISTUpdated : Feb 08, 2024, 09:58 AM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు పెళ్లి లైఫ్‌కి దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె మరోసారి పెళ్లికి సిద్ధమయ్యిందని తెలుస్తుంది.   

PREV
15
సమంత రెండో పెళ్లికి రెడీ?.. పేరెంట్స్ ఒత్తిడి మేరకు గ్రీన్ సిగ్నల్?

సమంత తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె `ఏం మాయ చేసావె` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలా మారింది. ఆమె ఎన్నో సూపర్‌ హిట్‌ మూవీస్‌లో నటించింది. యంగ్‌స్టర్స్ అందరితోనూ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకే పరిమితమవుతుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. 
 

25

సినిమాలు చేసే సమయంలోనే నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. టాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా మెలిగారు. కానీ ఊహించిన పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకున్నాయి. కుటుంబం, వ్యక్తిగతంకి సంబంధించిన కారణాలతో ఈ ఇద్దరు విడిపోయారు. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత చాలా కుంగిపోయింది. చాలా డిస్ట్రర్బ్ అయ్యింది. దీంతో అనారోగ్యానికి కూడా గురయ్యింది. మయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే 
 

35

దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పూర్తిగా కోలుకునేందుకే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. త్వరలోనే ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే సమంత మరోసారి పెళ్లి చేసుకుంటుందనే రూమర్స్ చాలా వినిపించాయి. వాటిని వారి టీమ్‌ ఖండిస్తుంది. అయినా ఈ రూమర్స్ ఆగడం లేదు. ఇప్పుడు మరోసారి ఊపందుకున్నాయి. ఈ సారి చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. పెళ్లికి సమంత ఓకే చెప్పిందని తెలుస్తుంది. 

45

పేరెంట్స్ ఇంట్లో సమంతని బాగా ఒత్తిడి తెస్తున్నారట. రెండో పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌ పెరిగిందట. దీంతో సమంత ఓకే చెప్పిందని లేటెస్ట్ రూమర్‌. నిజానికి సమంత  పెళ్లికి దూరంగా ఉండాలనుకుంది. తాను సింగిల్‌గానే ఉండాలని నిర్ణయించుకుందట. మళ్లీ పెళ్లి చేసుకోకూడదనుకుందట. కానీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి రెడీ అవుతుందని తెలుస్తుంది. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు తాను ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

55

తమ ఫ్యామిలీకి చెందిన బంధువుల వ్యక్తినే సమంత పెళ్లి చేసుకోవాలనుకుంటుందట. ఈ సారి ఫ్యామిలీ లైఫ్‌ని పూర్తిగా ప్రైవేట్‌గానే ఉంచాలనుకుంటున్నారట. చాలా కండీషన్స్ తో ఆమె ఓకే చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ సమంత సింగిల్‌గానే ఉండేందుకు ఇష్టపడుతుందని మరో వాదన. ఆమె మరోసారి పెళ్లికి రెడీగా లేదని సన్నిహిత వర్గాలసమాచారం. ఇది కేవలం రూమరేనా, నిజమా? అనేది తెలియాలంటే సమంత టీమ్‌ స్పందించాల్సిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories