హాట్ అందాలను క్లోజ్ గా చూపిస్తూ కేకపెట్టిస్తున్న సమంత.. వేరే లెవల్లో గ్లామర్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

Published : Jun 07, 2022, 11:10 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇటీవల గ్లామర్ డోస్ పెంచి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోసింది.  

PREV
16
హాట్ అందాలను క్లోజ్ గా చూపిస్తూ కేకపెట్టిస్తున్న సమంత.. వేరే లెవల్లో గ్లామర్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

సమంత ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. తను నటిస్తున్న చిత్రాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎక్కడా సమయం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్లోంది. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. వరుస సినిమాలకు సైన్ చేస్తోంది.
 

26

ఇటీవలె తను నటించిన తమిళ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’చిత్రం రిలీజ్ అయ్యింది. త్వరలో లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న రెండు భారీ చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అభిమానులు ఈ రెండు సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు. 
 

36

సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద' (Yashoda). హరి అండ్ హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, సంపత్ రాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

46

అలాగే ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న రెండో చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఇది. సమంత కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీగా రానుంది. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. పోస్ట్ ప్రోడక్షన్ పనులు కొనసాతున్నాయి. గతంలో వచ్చిన పోస్టర్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 

56

ఈ చిత్రాలు సమంత కేరీర్ లోనే బెస్ట్ మూవీస్ గా ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సమంంత ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాట్ ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. అప్పటికే ఈ అమ్మడు అందానికి ఫిదా అయ్యే నెటిజన్లు.. గ్లామర్ డోస్ పెంచడంతో క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.

66

తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటింట వైరల్ గా మారాయి. రెడ్ - పింక్ కాంబినేషన్ అవుట్ ఫిట్ లో సమంత కేకపెట్టిస్తోంది. హాట్  పోజులతో అందాల విందు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. హాట్ నెస్ పెంచి సమంత వరుస ఫొటోషూట్లు చేస్తుండటంతో అభిమానులతో పాటు, నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. పిక్స్ ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories