Janaki Kalaganaledu: గాజులు తీసుకోచ్చిన రామచంద్ర.. చెప్పకుండా వెళ్లినందుకు చెంప మీద కొట్టిన జానకి!

Published : Jun 07, 2022, 10:40 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పేరు గల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  ఇక ఈ రోజు జూన్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Janaki Kalaganaledu: గాజులు తీసుకోచ్చిన రామచంద్ర.. చెప్పకుండా వెళ్లినందుకు చెంప మీద కొట్టిన జానకి!

ఇక కాంపిటీషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ షాపింగ్ చేసి తిరిగి వస్తారు. కానీ రామచంద్ర (Rama Chandra) ఇంకా షాపింగ్ లోనే ఉంటాడు. ఇక పోటీ ప్రారంభించడం స్టార్ట్ చేస్తూ ఉండగా జానకి ( Janaki) కొంచెం వేచి ఉండండి అని వాళ్లని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వాళ్లు రామచంద్ర ను నానారకాలుగా అవమానిస్తారు. ఈలోపు రామచంద్ర పరిగెత్తుకుంటూ సరుకులు తీసుకుని వస్తాడు.
 

26

ఇక రామచంద్ర (Rama Chandra) సరుకులు చూసిన కాంపిటేషన్ సభ్యులు ఇంత తక్కువ షాపింగ్ చేసావు ఎందుకు అని అడుగుతారు. ఇక ఇచ్చిన వెయ్యి రూపాయలు లో 200 షాపింగ్ చేసి మిగతా 800 దాచుకున్నట్టు ఉన్నాడు అని అవమాన పరుస్తూ ఉంటారు. అంతేకాకుండా కాంపిటీషన్లో నియమాలు పాటించకపోతే ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది అని అంటారు. ఆ దృశ్యాన్ని టీవీలో చూస్తున్న మల్లిక (Mallika) సంబరపడుతూ ఉంటుంది.

36

ఇక రామచంద్ర (Rama Chandra) ఓడిపోయానని అందరి చేత అనిపించడం అనిపించుకోవడం కంటే ముందే తప్పుకోవడం మంచిది కదా అని అంటాడు. ఇక జానకి (Janaki)  గెలుపో ఓటమి నో ధైర్యంగా ఎదురుకుందాం అని ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత కాంపిటేషన్ సభ్యులు రామచంద్ర మానవత్వాన్ని తెలుసుకొని అతడిని చాలా ప్రశంసిస్తార. అంతే కాకుండా నెక్స్ట్ రౌండ్ కి వితౌట్ కాంపిటేషన్ తో పంపిస్తారు.
 

46

టీవీలో ఆ విషయం తెలుసుకున్న గోవిందరాజు (Govindaraju)  ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు. ఇక జ్ఞానాంబ (Jnanamba) ముఖంలో కూడా చిరునవ్వు మోలుస్తుంది. ఇక మరోవైపు మల్లిక దీని ఏమాత్రం జీర్ణించుకోలేక షాప్ లోకి వచ్చిన కస్టమర్ల పై చిరాకు పడుతూ ఉంటుంది. ఇక గోవిందరాజు తన కొడుకు కి ఫోన్ చేసి  తనలోని ఆనందాన్ని మొత్తం పంచుకుంటాడు.
 

56

ఇక జ్ఞానంబ (Jnanamba) కూడా నువ్వు చేసిన సహాయానికి నాకు నాకు చాలా సంతోషంగా ఉంది రా అంటూ.. రామచంద్ర (Rama Chandra) ను మెచ్చుకుంటుంది. అంతేకాకుండా అలా చేయడం ఇంకా గొప్ప గెలుపు నాన్న అని అంటుంది. మరోవైపు జానకి దంపతులు అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర సెల్ఫీ దిగుతూ ఉంటారు. అక్కడకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఇది చాలా పెద్ద నేరం 5000 ఫైన్ కట్టండి అని అంటాడు.
 

66

 ఇక తరువాయి భాగంలో జానకి (Janaki) దంపతులు చార్మినార్ దగ్గరికి వెళ్తారు. అక్కడ రామచంద్ర (Rama Chandra) జానకిని వదిలేసి ఒకచోటికి వెళతాడు. ఇక జానకి కంగారుపడుతూ వెతుకుతూ ఉంటుంది. ఈ లోపు రామచంద్ర జానకి దగ్గరికి వస్తాడు. దాంతో కోపంతో జానకి రామచంద్ర ను చంప మీద ఒకటి గట్టిగా కొడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories