వయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే సమంత కోలుకుంటున్నారు. తాజాగా ‘శాకుంతలం’ తోనూ అలరించింది. ఈక్రమంలోనే అటు తన లైనప్ లోని ‘ఖుషీ’, ‘సిటాడెల్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ని పూర్తి చేసే పనిలో ఉందని తెలుస్తోంది. సామ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న వచ్చిన స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 1న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.