తారక్, కళ్యాణ్ రామ్ లకి నో ఇన్విటేషన్.. దూరం పెడుతున్నారా, హరికృష్ణ ఉండి ఉంటే ఇలాగే జరిగేదా ?

Published : Apr 29, 2023, 10:43 AM ISTUpdated : Apr 29, 2023, 10:44 AM IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు టిడిపి పార్టీ ఈవెంట్ లాగా జరుగుతున్నాయి.

PREV
17
తారక్, కళ్యాణ్ రామ్ లకి నో ఇన్విటేషన్.. దూరం పెడుతున్నారా, హరికృష్ణ ఉండి ఉంటే ఇలాగే జరిగేదా ?

స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు టిడిపి పార్టీ ఈవెంట్ లాగా జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. 

 

27

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు పార్టీ కార్యక్రమం లాగా జరిగినా ఎలా జరిగినా కుటుంబ సభ్యులంతా సందడి చేస్తారని అభిమానులు భావించారు. కానీ వేదికపై బాలయ్య, చంద్రబాబు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ముఖ్యంగా మనవళ్లుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కనిపించకపోవడం ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

37

తారక్, కళ్యాణ్ రామ్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ తాతగారి శతజయంతి వేడుకలు అంటే వారసులకు కూడా పాల్గొనే హక్కు ఉంటుంది. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కళ్యాణ్ రామ్, తారక్ లకు ఇన్విటేషన్ అందలేదనే ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు పెద్ద నిరాశే అని చెప్పాలి. 

47

ఎందుకంటే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్ని అన్నీ తానై నడిపిస్తోంది బాలయ్య. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లని బాలయ్యే దూరం పెడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ పుకార్లు నందమూరి అభిమానులకు మింగుడు పడడం లేదని నెటిజన్లు అంటున్నారు. 

57

బాలయ్య తర్వాత ఆ స్థాయిలో తాతగారి వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది తారక్. అలాంటి తారక్ , కళ్యాణ్ రామ్ బ్రదర్స్ శతజయంతి ఉత్సవాల్లో లేకపోవడం ఏదో వెలితిగా ఉందని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు. 

67

ఇదే సమయంలో నందమూరి హరికృష్ణ గురించి కూడా చర్చ జరుగుతోంది. హరికృష్ణ ఈ సమయంలో ఉండి ఉంటే ఇంకా ఆ సందడి ఎక్కువగా ఉండేది. ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన ఏకం చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికైనా కళ్యాణ్ రామ్, తారక్ సహా నందమూరి ఫ్యామిలీ మొత్తానికి ఆహ్వానం పంపి శతజయంతి వేడుకల్లో పాల్గొనేలా చేయాలని ఫ్యాన్స్ రిక్వస్ట్ చేస్తున్నారు.

77

అయితే తారక్, కళ్యాణ్ రామ్ లకి ఇన్విటేషన్ అందకపోవడం విషయంలో ఫ్యాన్స్ మరోలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని టిడిపి శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. మే 20న హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఒక ఈవెంట్ జరగనుందట. ఈ విషయాన్ని బాలయ్యే తెలిపినట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజయరయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 

Read more Photos on
click me!

Recommended Stories