గ్రీన్‌ డ్రెస్‌లో థై షోతో పిచ్చెక్కిస్తున్న విజయ్‌ భామ.. మాళవిక మోహనన్‌ వీకెండ్‌ ట్రీట్‌కి ఫ్యాన్స్ పండగ

Published : Dec 04, 2021, 08:56 PM IST

విజయ్‌ భామ మాళవిక మోహనన్‌ హాట్‌ సెన్సేషన్‌గా మారుతుంది. గ్లామర్‌ షోతో రెచ్చిపోతూ ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తనలోని ఘాటైన అందాలను చూపిస్తూ కుర్రాళ్లు పండుగ చేసుకునేలా చేస్తుంది. 

PREV
16
గ్రీన్‌ డ్రెస్‌లో థై షోతో పిచ్చెక్కిస్తున్న విజయ్‌ భామ.. మాళవిక మోహనన్‌ వీకెండ్‌ ట్రీట్‌కి ఫ్యాన్స్ పండగ

మాళవిక మోహనన్‌ గ్రీన్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. తనకిష్టమైన గ్రీన్‌ డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. హాట్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. వీరికి వీకెండ్‌ ట్రీట్‌నిచ్చింది. థై షో చేస్తూ మాళవిక పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్లకి మెస్మరైజ్‌ చేస్తున్నాయి. కట్టిపడేస్తున్నాయి. మాళవిక తన ఫ్యాన్స్ కే కాదు, నెటిజన్లకి కూడా మంచి ట్రీట్‌నిచ్చిందీ విజయ్‌ భామ. 

26

దళపతి విజయ్‌తో `మాస్టర్‌` చిత్రంలో నటించి పాపులర్‌ అయ్యింది మాళవిక మోహనన్‌. ఈ సినిమా సక్సెస్‌లో సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. నెమ్మదిగానే అవకాశాలను అందిపుంచుకున్నా.. మున్ముందు తనదే సందడంతా అనే సిగ్నల్స్ ఇస్తుంది. 

36

కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్‌ బ్యూటీగా నిలుస్తున్న మాళవిక మోహనన్‌ ఇటీవల మరింతగా రెచ్చిపోయింది. తన అందాలను అప్పనంగా ఆరబోసి కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తుంది. మతులు గతులు తప్పేలా చేస్తుంది. కేరళాలో 1992లో జన్మించిన ఈ అందాల సోయగం ఎక్కువగా ముంబయిలో పెరిగింది. తండ్రి కె.యు మోహనన్‌ మాలీవుడ్‌ సినిమాలతోపాటు బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసేవారు. దీంతో ఈ అమ్మడు ముంబయిలో పెరిగింది. 

46

గ్రాడ్యూయేట్‌ చేసిన మాళవిక చదువుకునే టైమ్‌లోనే మోడల్‌గా చేసింది. పలు కమర్షియల్‌ యాడ్స్ లో నటించింది.  ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌లో మమ్ముట్టితోనూ యాక్ట్ చేసింది. ఇలా జనాలకు పరిచయం అయ్యిందీ హాట్‌ భామ. 2013లో `పట్టమ్‌ పోలే` చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించి ఆకట్టుకుంది. అనంతరం రెండేళ్ల తర్వాత `నిర్ణయకమ్‌` లో మెరిసింది. 
 

56

2016లో కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంలో యంగ్‌ హీరో పృథ్వీ సరసన అలరించింది. మరో ఏడాది 2017లో `బియాండ్స్ ది క్లౌడ్స్` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. అదే ఏడాది మలయాళంలో చేసిన `ది గ్రేట్‌ ఫాదర్‌` సినిమా మాళవికకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె నటన మెస్మరైజ్‌ చేస్తుంది. 2019లో `పెట్టా` చిత్రంలో రజనీకాంత్‌ సరసన మెరిసింది. తమిళంలోకి డెబ్యూ ఇస్తూనే రజనీతో నటించడంతో మాళవిక కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఇందులో ఆమె నటన మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. 

66

తమిళంలో విజయ్‌ తో `మాస్టర్‌` చిత్రంలో నటించే అవకాశం తీసుకొచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ తో `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories