Samantha: వరుస పోస్ట్ లతో షాకిస్తున్న సమంత.. అబద్దాలనే నమ్ముతున్నారంటూ ఆవేదన.. టార్గెట్‌ ఎవరు? హాట్‌ టాపిక్‌

Published : May 06, 2022, 03:17 PM IST

సమంత చేస్తున్న వరుస పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన పోస్టులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఆమె టార్గెట్‌ ఎవరనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. 

PREV
16
Samantha: వరుస పోస్ట్ లతో షాకిస్తున్న సమంత.. అబద్దాలనే నమ్ముతున్నారంటూ ఆవేదన.. టార్గెట్‌ ఎవరు? హాట్‌ టాపిక్‌

సమంత(Samantha) తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ప్రతి కదలిక హాట్‌ టాపిక్‌ అవుతుంది. ముఖ్యంగా ఆమె చేసే ప్రతి పోస్ట్ చర్చనీయాంశమవుతుంది. తన మనసులోని విషయాలను ఆమె పరోక్షంగా బయటపెడుతుంది. తన భావాలను కొటేషన్ల రూపంలో షేర్‌ చేసుకుంటుంది. అందుకే హాట్‌ టాపిక్‌ అవుతుంది. నాగచైతన్య నుంచి డైవర్స్ ప్రకటించినప్పట్నుంచి సమంత చేసే ప్రతి పోస్ట్ (Samantha Post) లోనూ ఇన్నర్‌గా ఇంకేదో మీనింగ్‌ దాగుండటం విశేషం. 

26

తాజాగా ఆమె పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సమంత.. నిజాలు రేర్‌గా బయటకు వస్తాయని, కానీ అబద్దాలే ఎక్కువగా ప్రచారంలో ఉంటాయని చెప్పింది. అంతేకాదు అబద్దాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుందని తెలిపింది సమంత.  హాలీవుడ్‌ మూవీకి సంబంధించిన పోస్ట్ ని ఆమె షేర్‌ చేయడం విశేషం. అయితే ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే అని, పరోక్షంగా ఎవరినో టార్గెట్‌ చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

36

ఇదే కాదు ఇంకొన్ని పోస్టులు షేర్‌ చేసింది. ఇందులో `ప్రపంచం ఎంత క్రూరంగా మారినప్పటికీ నిజమైన ఫ్లెక్స్ దయతో ఉంటుంది` అని, `నెమ్మదించండి. మీరు బాగానే ఉన్నారు. అన్నింటికంటే ముందే మీరు ఉండాలనుకుంటే ఉండలేరు` అని వీడియో కోట్ ని పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ లు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ లు పెడుతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. 

46

సమంత.. తన స్టయిలిస్ట్ ప్రీతమ్‌తో `ఐ లవ్‌ యూ`, `ఐటూ లవ్‌ యూ` అంటూ పంచుకున్న పోస్టులు ఇటీవల దుమారం రేపాయి. వీరిద్దరి మధ్య ఇంకేదో ఉందనే గుసగుసలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే సమంత దీన్ని ఉద్దేశించిన కామెంట్ పెట్టి ఉండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక నాగచైతన్యకి సంబంధించిన విషయంలో ఆమె ఇలా పరోక్షంగా పోస్ట్ లు పెడుతుందా? అనేది సస్పెన్స్ గా, ఆసక్తికరంగా మారాయి.

56

ఇక నాలుగేండ్ల దాంపత్య జీవితం అనంతరం నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు గతేడాది అక్టోబర్‌ 2న ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి అనుహ్య ప్రకటన అందరిని షాక్‌కి గురి చేసింది. విడిపోవడానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే గత మూడు నెలలుగా వీరిద్దరి పోస్ట్ లు, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించడం అనుమానాలు రేకెత్తించాయి. ఊహించినట్టే వీరిద్దరు విడిపోయారు. 

66

ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్‌లో సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. `యశోద` అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ గురువారం విడుదలై ట్రెండ్‌ అయ్యింది. ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. దీంతోపాటు `శాకుంతలం` అనే మరో సినిమా చేస్తుంది. అలాగే విజయ్‌ దేవరకొండతో శివ నిర్వాణ చిత్రం, ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ చేస్తుంది సమంత. ఇటీవల విజయ్‌ సేతుపతి,నయనతారలతో కలిసి నటించిన `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రం విడుదలై పరాజయం చెందిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories