#AVAK:విశ్వక్‌ సేన్‌ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' రివ్యూ

Surya Prakash   | Asianet News
Published : May 06, 2022, 02:04 PM IST

'అశోకవనంలో అర్జున కళ్యాణం' శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్‌లో చూపించినట్టుగానే 30 ఏళ్లు పైబడిన అల్లం అర్జున్ కుమార్‌కు పెళ్లి.. అనే కాన్సెప్ట్ చుట్టూనే సినిమా తిరుగుతుంది.

PREV
111
#AVAK:విశ్వక్‌ సేన్‌ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' రివ్యూ


'వెళ్లిపోమాకే' సినిమాతో లవర్ బాయ్‌గా పరిచయమైన విశ్వక్‌ సేన్‌ తర్వాత మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్‌ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పు పొందాడు. తాజాగా విశ్వక్‌  మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను డిఫెరెంట్ గా చేసారు.   ఈ రోజు ఈ చిత్రం విడుదల చేసారు.  రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా కాస్తంత వివాదాలు క్రియేట్ చేసిన విశ్వక్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ నమ్మకాలు నిజమయ్యాయా...సినిమా హిట్టవుతుందా..అసలు ఈ కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.   (AVAK Movie review)

211


స్టోరీ లైన్ 

సూర్య పేట కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కు పెళ్లి వయస్సు దాటిపోతోందనే బెంగ. మొత్తానికి వలేసి, రకరకాల ప్రయత్నాలు చేసి,  వేరే కులంఅమ్మాయి అయినా ఓకే చెప్పేస్తాడు. ఆ రకంగా గోదావరి జిల్లా అమ్మాయి మాధవి (రుక్సార్ థిల్లాన్)నుతో  వివాహానికి రెడీ అవుతాడు. ఎంగేజ్మెంట్ కి బంధుమిత్ర సపరివారంగా అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అయితే అనుకోని కారణంగా కోవిడ్  దెబ్బతో...పెట్టిన  జనతా కర్ఫ్యూ లాక్ డౌన్  వల్ల అర్జున్ కుమార్ & అతని జనం అంతా అమ్మాయి ఇంట్లో ఉండాల్సి వస్తుంది.  (AVAK Movie review)

 

311


ఈ లోగా ఆ అమ్మాయి మాధవికి దగ్గర కావాలని అర్జున్ కుమార్ ప్రయత్నాలు మొదలెడతాడు. కానీ ఆ  అమ్మాయి దూరం పెడుతూండటంతో ఫలించవు. సరిగ్గా పెళ్లికి ముందు లేచిపోతుంది. ఆ క్రమంలో అర్జున్ కుమార్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? అమ్మాయి వెళ్లిపోయాక కూడా వాళ్లింట్లో ఉండాల్సి రావడంతో వాళ్ల కుటుంబం ఎలా ఫీల్ అయ్యింది? చివరికి, అర్జున్ కుమార్ ఏం  చేశాడు? ఆఖరికి పెళ్లి అయ్యిందా?  లేదా అనేది  మిగతా కథ (AVAK Movie review)
 

411
Ashoka Vanamlo Arjuna Kalyanam


పెళ్లికు ముందు పెళ్లికూతురు లేచిపోవటం లాంటి కథలు మనకు కొత్తేమీ కాదు. అయితే అది కథలో భాగం అయితే ఏ సమస్యా లేదు. కాకపోతే అదే కథలో మెయిన్ ట్విస్ట్ అయినప్పుడే సమస్య అంతా. కథ కు కావాల్సిన సమస్యను ఈ లేచిపోవటం...పెళ్లికొడుకు ఆవేదన రొటీన్ గా మింగేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రెడిక్టుబుల్ గా ఊహించే బుద్దేస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. దానికి తగినట్లు..లాక్ డౌన్ కామెడీ..ఎంత కొత్తగా వెళ్దామనుకున్నా రొటీన్ సీన్స్ వచ్చేస్తాయి. థియోటర్ లో అప్పటికప్పుడు నవ్వినా ...ఆ తర్వాత ఏం చూసాము అంటే ఏమీ లేదనిపిస్తుంది.

511
Ashoka Vanamlo Arjuna Kalyanam

 

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే టైటిల్ ఎంత డిఫ‌రెంట్‌గా ఉందో, సినిమా కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటాం. కానీ లాక్ డౌన్ ట్విస్ట్ తో కాస్తంత రొటీన్ లుక్ వచ్చేసింది. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ అయినా ఏదో వెలితి కనపడుతుంది. కథలో హీరో చెయ్యగలిగేమీ ఉండదు. పరిస్దితిలకు తగినట్లు రియాక్ట్ అవటమే. విధి లేదా పరిస్దితులు కథను మలుపు తిప్పుతాయి. దాంతో కాంప్లిక్ట్స్  వచ్చినా అది స్టోరీ పాయింటాఫ్ నుంచి ఉంటుంది కానీ పూర్తిగా హీరో పాయింటాఫ్ నుంచి ఉండదు. దాంతో కథలో వచ్చిన సమస్య నుంచి హీరో తప్పుకోవటానికి హీరో చేయగలిగేది ఏమీ ఉండదు. కాకపోతే ఆ లోటుని  డైలాగ్స్....  విష్వ‌క్ మేనరిజంలతో కనపడకుండా మ్యానేజ్ చేయగలిగారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే అయితే పరుగెత్తింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. అయితే ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ దాకా చెప్పుకోదగన సంఘటనలు ఏమీ జరగక...సెకండాఫ్ లాగినట్లు అనిపించింది. ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలకు స్క్రిప్టే ప్రాణంగా ఉండాలి. అక్కడిదాకా బాగానే ఉంది. 

611
Ashoka Vanamlo Arjuna Kalyanam


అక్కడక్కడా సత్య నటించిన వివాహ భోజనంబు గుర్తు వస్తుంది. అదీ లాక్ డౌన్, పెళ్లి,  పెళ్లి వారింట్లో స్టక్ అవటం మీద రాసిన కథే. అయితే ఇక్కడ డీసెంట్ గా కథ నడిపారు. సీన్స్ లో ఫన్ ని బాగా ఎలివేట్ చేసారు. క్యారక్టర్స్ తో కథను నడిపే ప్రయత్నం చేసారు. లాక్ డౌన్ మీద సినిమాలు,వెబ్ సీరిస్ లు ఇప్పటికే వచ్చేయటం కాస్త ఇబ్బందికలిగించే అంశం.  కాకపోతే డైరక్టర్, రైటర్ కలిసి ఓ క్లీన్ సినిమాగా దీన్ని ప్రెజెంట్ చేయటం కలిసి వచ్చింది. అయితే ట్రైలర్ చూసి ప్యూర్ గా ఇది పెళ్లి చుట్టూ తిరిగే కామెడీ అనుకుంటే మాత్రం లాక్ డౌన్ తో పుట్టే కామెడీ కాస్త నిరాశపరుస్తుంది. అలాగే ఎక్కువ సేపు ఒకే ఇంట్లో కథ నడవటంతో మనమే స్టక్ అయ్యిపోయిన ఫీలింగ్ వస్తుంది.

ఓవరాల్ గా విశ్వక్  లుక్ కొత్త‌గా ఉంది. డైలాగులు, సీన్లు, పెళ్లి కోసం విశ్వక్ సేన్​ చేసే ప్రయత్నాలు  బాగున్నాయి. ఈ సినిమాతో సరైనా సమయంలో పెళ్లి చేసుకోకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో హ్యూమరస్​గా చేయటంతో చాలా మంది కనెక్ట్ అవుతారు.

711
Ashoka Vanamlo Arjuna Kalyanam



స్క్రిప్టు ఇంకొంత స్ట్రాంగ్ గా ఉంటే..కేవలం డైలాగులే కాకుండా సీన్స్ కూడా గుర్తుండేవి. అయితే డైలాగులు మాత్రం సినిమాని మొత్తం మోసాయి అని చెప్పాలి. స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే అన్నట్లుంది. ఫార్మెట్ వదలలేదు. కొత్తగానూ వెళ్లలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.  గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు. .పాటల్లో ఓ ఆడపిల్ల పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నీటుగా ఉంది. ఎడిటర్ కాస్త ప్రేక్షకుల తరపు నుంచి చూసి సెకండాఫ్ లో  ఓ అరగంట పైన తీసేయచ్చు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

811
Ashoka Vanamlo Arjuna Kalyanam


ఇక నటీనటుల్లో ..అర్జున్ కుమార్ అల్లం పాత్రలోకి  విశ్వక్ సేన్ పరకాయ ప్రవేశం చేసారు. ఎక్కడా అతి అనిపించలేదు. అతనిలో ఉన్న మంచి నటుడు చాలా చోట్ల కనపడతాడు. ఎమోషన్ సీన్స్ లో అండర్ ప్లే చేసి ఆశ్చర్యపరుస్తాడు.   రుక్సార్ జస్ట్ ఓకే అంతే.  రుక్సార్ చెల్లెలు పాత్రలో కనిపించిన రితికా నాయక్ బాగుంది వెన్నెల కిశోర్ ఒక్క సీన్ లో అయినా బాగా నవ్వించారు.  తమిళ హీరో అశోక్ సెల్వన్ గెస్ట్ రోల్ లో కనిపించారు. కాదంబరి కిరణ్, గోపరాజు రమణ వంటివారు సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా లాక్కెళ్లిపోయారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో, గోదావరి యాసతో రాజావారు రాణిగారు ఫేమ్ రాజ్ కుమార్ చాలా బాగా చేసారు.

911
Ashoka Vanamlo Arjuna Kalyanam


పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక

ఫన్నీ డైలాగులు  

 

లాక్ డౌన్ నేపధ్యం
సెకండాఫ్ లో వచ్చే కొన్ని లాగుడు సీన్స్ 
 

1011
Ashoka Vanamlo Arjuna Kalyanam


ఇది  సత్య 'వివాహభోజనంబు' కి  విశ్వక్ సేన్ వెర్షన్  

రేటింగ్: 2.75/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

 

 అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను డిఫెరెంట్ గా చేసారు.   ఈ రోజు ఈ చిత్రం విడుదల చేసారు.  

1111
Ashoka Vanamlo Arjuna Kalyanam

నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ,  కాదంబరి కిరణ్ తదితరులు
కథ, కథనం, మాటలు, షో రన్నర్: రవి కిరణ్ కోలా 
సినిమాటోగ్రఫీ: పవి కె పవన్ 
సంగీతం: జయ్ క్రిష్‌     
సమర్పణ: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
నిర్మాతలు: భోగవల్లి బి, సుధీర్ ఈద‌ర‌
దర్శకత్వం: విద్యాసాగ‌ర్ చింతా
విడుదల తేదీ: మే 06, 2022
 

click me!

Recommended Stories