కానీ గుణశేఖర్ సాహసం చేస్తూ సమంతతో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని 'శాకుంతలం' గా తెరకెక్కించారు. కాళిదాసు రచించిన అభిఙ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రన్ని రూపొందించారు. గుణశేఖర్ ఎక్కువ సమయం తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అవుట్పుట్ బావుంటుందని అంతా ఆశించారు.