సమంత కొంతకాలంగా సినిమాల పరంగా యాక్టివ్ గా లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. చాలా కాలం పాటు సమంత ఆరోగ్య సమస్యలతో పోరాడి తిరిగి ఫిట్ నెస్ సాధించింది. ఈ క్రమంలో హెల్త్ సహకరించకపోయినా.. శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాలు చేసింది. ఇప్పుడిప్పుడే సామ్ తన ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది.