కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు.. ఎవరైనా వణికిపోవాల్సిందే, మాటిమాటికీ అలా చేయడంతో..

Published : Jun 29, 2024, 10:46 AM IST

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఎడి చిత్రంతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కల్కి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే కల్కి చిత్రం 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

PREV
16
కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు.. ఎవరైనా వణికిపోవాల్సిందే, మాటిమాటికీ అలా చేయడంతో..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఎడి చిత్రంతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. కల్కి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే కల్కి చిత్రం 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే 1000 కోట్లు సాధ్యమే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. 

26

ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. మహాభారతాన్ని, కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ సినిమా చేయాలనే ఆలోచన రావడమే అద్భుతం. అదే విధంగా రిస్క్ కూడా. కానీ నాగ్ అశ్విన్ సమర్థవంతంగా డీల్ చేసి మెప్పించాడు. 

36

విచిత్రమైన గెటప్పులు వేసి మెప్పించాలంటే కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. ఎలాంటి పాత్రలో అయిన తన నటనతో ఔరా అనిపించడం కమల్ కే చెల్లింది. ఈ చిత్రంలో కూడా కమల్ తన మార్క్ ప్రదర్శించారు. అయితే కల్కి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ ప్రభాస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని రివీల్ చేశారు. 

46
Kalki 2898 AD box office

 

కమల్ హాసన్ కెరీర్ బిగినింగ్ లో డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆయా సమయంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుతో పరిచయం ఉండేదట. కృష్ణం రాజు హీరోగా నటించే కొన్ని చిత్రాలకు కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేశారు. 

56

కమల్ మాట్లాడుతూ కృష్ణంరాజు గారికి డ్యాన్స్ అంతగా రాదు. ఏవైనా స్టెప్పులు చెబితే కష్టంగా చేసేవారు. నేను మాటిమాటికి కష్టమైన స్టెప్పులు చెబుతుండడంతో ఆయనకి కోపం వచ్చింది. ఏంటి ఇంత కష్టమైన డ్యాన్స్ ఇస్తున్నావ్. ఇకపై కష్టమైన మూమెంట్స్ ఇచ్చావంటే నీ సంగతి చెబుతా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చినట్లు కమల్ తెలిపారు. 

66
Kamalhaasan

ఆయన చాలా మంచి వ్యక్తి అని కమల్ పేర్కొన్నారు. ఆ విధంగా కమల్ కి ప్రభాస్ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. కల్కి పార్ట్ 2 పై ఆల్రెడీ హింట్ ఇచ్చారు. పార్ట్ 2 లో తన పాత్ర ఇంకా ఎక్కువ ఉంటుందని కమల్ రివీల్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories