నీలా ప్రేమించేవారు మరొకరు లేరు, సమంత ఓపెన్ కామెంట్స్, ప్రస్తుత పరిణామాల నడుమ సంచలన పోస్ట్

Published : Dec 09, 2024, 09:08 PM IST

 సింగిల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సమంత చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. సదరు పోస్ట్ లో సమంత ఒకరి ప్రేమకు సాటి లేదని వెల్లడించింది.   

PREV
16
 నీలా ప్రేమించేవారు మరొకరు లేరు, సమంత ఓపెన్ కామెంట్స్, ప్రస్తుత పరిణామాల నడుమ సంచలన పోస్ట్

సమంత తన భర్త నాగ చైతన్యతో విడిపోయి మూడేళ్లు అవుతుంది. ఆమె సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. సమంతపై ఇటీవల బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. సమంత ఒక దర్శకుడితో రిలేషన్ లో ఉన్నారు అనేది సదరు కథనాల సారాంశం. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ నిడిమోరు, సమంత డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. 


 

26

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే.. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ వంటి సిరీస్లతో పాప్యులర్ అయ్యారు. తాజాగా వీరు సిటాడెల్: హనీ బన్నీ తెరకెక్కించారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2, హనీ బన్నీ సిరీస్లలో సమంత నటించిన సంగతి తెలిసిందే. రాజ్ తో ఎఫైర్ రూమర్స్ పై సమంత స్పందించలేదు. ఆమె మౌనం వహించారు. 

36

సమంత కెరీర్ ఒకింత నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరి ఆమె వరుస చిత్రాలకు సైన్ చేయడం లేదు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది సమంత. ఈ నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. సమంత లుక్ కట్టిపడేసింది. సమంత ప్రధాన పాత్ర చేస్తుంది. ఈ చిత్రంపై మరో అప్డేట్ రాలేదు. 

 

46
Samantha

కాగా సమంత హైదరాబాద్ లో ఓ పెంట్ హౌస్లో ఉంటుంది. విడాకులకు ముందు నాగ చైతన్య, సమంత ఆ ఇంట్లో కలిసి జీవించారు. అక్కడ ఉంటూ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా ఆ పెంట్ హౌస్ అమ్మేశారు. కొత్త ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే... సమంత-నాగ చైతన్య విడిపోయారు. అమ్మేసిన పెంట్ హౌస్ ని తిరిగి కొనుగోలు చేసిన సమంత, అక్కడే ఉంటుందని సమాచారం. 

56

సమంత ఖాళీగా ఉంటే తన పెట్ డాగ్స్ తో సమయం గడుపుతుంది. ఆడుకుంటుంది. హ్యాష్ పేరుతో సమంత వద్ద ఒక డాగ్ ఉండేది. దానికి తోడుగా సాషా అనే మరో డాగ్ ని తెచ్చింది. సాషా తో దిగిన ఫోటో షేర్ చేసిన సమంత ''నో లవ్ లైక్ సాషా లవ్'' అని కామెంట్ పోస్ట్ చేసింది. తన పెట్ డాగ్ సాషా ప్రేమించినంతగా మరొకరు ప్రేమించలేరు. సాషా ప్రేమకు సాటి లేదని అర్థం వచ్చేలా ఆ కామెంట్ చేసింది. 


 

66

నాగ చైతన్య డిసెంబర్ 4న రెండో వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేశాడు. ఈ పరిణామాల నడుమ సమంత సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. సమంత గత రెండేళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే... 

Read more Photos on
click me!

Recommended Stories