Samantha: హేటర్స్‌కు సమంత స్వీట్ కౌంటర్.. మా ఇంటి బంగారంలో సాయి పల్లవి, సీక్రెట్ చెప్పేసింది స్టార్‌ హీరోయిన్‌

Published : Jun 08, 2026, 02:06 PM IST

హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు, తన నిర్మాణంలో రాబోతున్న 'మా ఇంటి బంగారం' సినిమాకు మొదట సాయి పల్లవిని అనుకున్నారనే ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

PREV
15
హేటర్స్‌కు సమంత రిప్లై

సౌత్ ఇండియా 'క్వీన్' సమంత రూత్ ప్రభు, 'మా ఇంటి బంగారం' సినిమాతో మళ్లీ స్క్రీన్‌పైకి రావడానికి రెడీ అవుతోంది. ఇందులో ఆమె మెయిన్‌ లీడ్‌గా చేస్తూనే నిర్మించింది. తన భర్త రాజ్‌ నిడిమోరుతో కలిసి ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది సమంత. అందులో భాగంగా ఆమె లేటెస్ట్ గా అభిమానులతో ముచ్చటించింది.  క్వశ్చన్-ఆన్సర్ సెషన్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ముఖ్యంగా, తనను ద్వేషించే వారి (హేటర్స్) గురించి ఆమె ఇచ్చిన ఒక సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

25
హేటర్స్‌కు కౌంటర్ ఇచ్చిన సమంత

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానుల ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇస్తుండగా, ఒక ఫ్యాన్ 'మిమ్మల్ని ద్వేషించే వారిని ఒకే మాటలో ఎలా వర్ణిస్తారు?' అని అడిగాడు. దీనికి సమంత సీరియస్‌గా కాకుండా, ఒక చిన్న నవ్వుతో చాలా సరదాగా బదులిచ్చింది. 'హేటర్సా? ఎవరి హేటర్స్? నాకసలు హేటర్స్ ఉన్నారా ఏంటి?' అని ఫన్నీగా తిరిగి ప్రశ్నించింది. ఏ నెగెటివిటీని పట్టించుకోకుండా సమంత ఇచ్చిన ఈ పాజిటివ్ రిప్లై, అభిమానుల మనసు గెలుచుకుంది.

35
సాయి పల్లవినే ఫస్ట్ ఛాయిస్!

ఈ ఛాటింగ్‌లో సమంత ఒక పెద్ద సీక్రెట్ బయటపెట్టింది. 'మా ఇంటి బంగారం' సినిమా హీరోయిన్ కోసం మొదట సాయి పల్లవినే సంప్రదించారట. కానీ, సాయి పల్లవి డేట్స్ కుదరకపోవడంతో, ఆ అవకాశం చివరికి సమంతకు వచ్చింది. దీని గురించి సమంత మాట్లాడుతూ, 'నేను ఈ సినిమాను ఎంచుకోలేదు, ఈ సినిమానే నన్ను ఎంచుకుంది' అని ఎమోషనల్ అయింది. తన క్యారెక్టర్‌కు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారని కూడా చెప్పింది. సాయి పల్లవిని మెచ్చుకుంటూ, భవిష్యత్తులో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో ఆమెతో కలిసి పనిచేయాలని ఉందని తెలిపింది.

45
'మా ఇంటి బంగారం' స్పెషాలిటీస్ ఏంటి?

ఈ సినిమాలో సమంత ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే, అన్యాయాన్ని ఎదిరించే ఫైటర్‌గానూ అదరగొట్టబోతోంది. ఇది కామెడీతో కూడిన యాక్షన్ డ్రామా అని, సమంత క్యారెక్టర్‌కు చాలా షేడ్స్ ఉంటాయని  ఇటీవల విడుదలైన ట్రైలర్‌ బట్టి అర్థమవుతుంది. సమంతతో 'ఓ బేబీ' లాంటి సూపర్‌హిట్ సినిమా తీసిన నందిని రెడ్డే ఈ చిత్రానికి దర్శకురాలు. కన్నడ నటుడు దిగంత్ మంచాలే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు గుల్షన్ దేవయ్య, గౌతమి తడిమళ్ల, శ్రీముఖి, మంజుష కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

55
మా ఇంటి బంగారం రిలీజ్ ఎప్పుడు?

ఈ సినిమాకు సమంత సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డిలతో కలిసి తన సొంత బ్యానర్‌ ట్రాలాల మూవింగ్‌ పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, 2026 జూన్ 19న థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత సమంత కమ్‌ బ్యాక్‌ ఇస్తోన్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories