సమంత బరువుపై ఊహించని ట్రోలింగ్.. ఫిట్నెస్, హెల్త్ పై రూమర్స్, ఎలా సమాధానం ఇచ్చిందో చూడండి

Published : Jun 30, 2025, 01:29 PM IST

సమంత బరువు, ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమె బాగా సన్నబడిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సమంత ట్రోలర్స్ కి సమాధానం ఇచ్చింది. 

PREV
15
సమంత బరువుపై ట్రోలింగ్ 

నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య పరిస్థితి, శరీర ఆకృతి గురించి వచ్చిన విమర్శలకు బలమైన కౌంటర్ ఇచ్చారు. సమంత బాగా బరువు తగ్గిపోయిందని.. సన్నగా అనారోగ్యంగా కనిపిస్తోంది అంటూ పలువురు ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనితో తనని ట్రోల్ చేస్తున్నవారికి సరైన విధంగా సమంత కౌంటర్ ఇచ్చింది. 

25
ఘాటైన కౌంటర్ ఇచ్చిన సామ్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో పుల్అప్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన సమంత, ‘‘ముందుగా మీరు ఈ మూడు పుల్అప్స్ చేయగలిగిన తర్వాతే నన్ను సన్నగా, అస్వస్థతగా ఉన్నానని కామెంట్ చేయండి. చేయలేకపోతే కామెంట్ చేయొద్దు అని అంటూ డబుల్ మీనింగ్ లో ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ విధంగా తన శరీరంపై వచ్చిన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చింది సామ్ .

అయితే సమంత బరువుపై కామెంట్స్ చేసే వారిలో కొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. సమంత కాస్త బరువు పెరిగితే బావుంటుందని.. సౌత్ హీరోయిన్లు మినిమమ్ వెయిట్ ఉండాలని అంటున్నారు. నార్త్ హీరోయిన్లకు అయితే ఆ తరహా లుక్ వర్కౌట్ అవుతుందని చెబుతున్నారు. 

35
మయోసైటిస్ తర్వాత ప్రత్యేక డైట్ 

సమంత బరువుపై కామెంట్స్ రావడం ఇది మొదటిసారి కాదు.గతంలో కూడా సమంతపై ఒక సోషల్ మీడియా యూజర్ ఆమె బరువు పెరగాలని కామెంట్ చేయగా, ఆమె దానికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ‘‘నేను ప్రస్తుతం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను. అందుకే తాను డాక్టర్ల సూచనల ప్రకారం కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ పాటించాల్సి ఉంది. ఇది నా బరువు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. బాడీ వెయిట్ గురించి ఎవరూ జడ్జ్ చేయొద్దు’’ అని అప్పట్లో సమంత సమాధానం ఇచ్చింది. 

45
సమంత కెరీర్ పరంగా బిజీ

 2022లో మయోసైటిస్ వ్యాధిని స్వయంగా ప్రకటించిన ఆమె, అప్పటినుంచి కొన్ని నెలల విరామం తీసుకున్నారు. ఆమె నటించిన శాకుంతలం (2022) , యశోద (2023) సినిమాలు విడుదలయ్యాయి. 2023లో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అంతేగాక రాజ్ & డీకే తెరకెక్కించిన అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ సిటాడెల్ హాని బన్నీలో కూడా నటించారు.

55
నిర్మాతగా తొలి ప్రయత్నం

సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ఆమె నిర్మించిన తొలి చిత్రం శుభం. శుభం మూవీ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. సింపుల్ హారర్ కామెడీ కాన్సెప్ట్ తో కొత్త వారితో సమంత నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories