Samantha: ఒక్క పాటకు కోట్లు తీసుకునే సమంత, అసాధారణ సక్సెస్‌ జర్నీ.. పేదరికం నుంచి కోట్లకు

Published : Jun 15, 2026, 12:37 PM IST

Samantha: చిన్నప్పుడు పేదరికం చూసిన సమంత.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా ఎదిగింది. ఆమె లైఫ్ స్టోరీ ఏ సినిమా కథకూ తీసిపోదు. సమంత సక్సెస్‌ జర్నీపై ఓ లుక్కేద్దాం. 

PREV
16
ఇండియాలో టాప్‌ హీరోయిన్‌గా సమంత

సమంత ఇండియన్‌ సినిమాలోనే అత్యంత పాపులారిటీ ఉన్న హీరోయిన్‌. ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. మూడేళ్ల తర్వాత మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇస్తున్న సమంత ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు కావడం విశేషం. ఈ మధ్యే ఒకే ఒక్క పాట కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ విని ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. 

26
పేదరికం నుంచి తిరుగులేని స్టార్‌ హీరోయిన్

సమంత కెరీర్ మొదట్లో అంతా పూలపాన్పు కాదు. పేదరికం నుంచి వచ్చిన ఆమె, కష్టపడి చదువుకుని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో రూ.500ల కోసం వెల్‌కమ్‌ గర్ల్ గానూ పనిచేసింది. తనఖర్చులకు తానే సంపాదించుకోవాల్సి వచ్చేది. డబ్బుల కోసం  మోడలింగ్‌ లోకి వచ్చింది. దీంతో ఆమె లైఫ్‌ మారిపోయింది. దాన్నుంచి సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. తమిళం, తెలుగులో చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టింది.   విజయ్, సూర్య, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరితో నటించే స్థాయికి ఎదిగింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దుమ్మురేపుతోంది. హీరోల స్థాయిలో యాక్షన్‌ చేస్తూ మెప్పిస్తోంది. 

36
స్పెషల్ సాంగ్‌కి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ సమంత

సమంత కెరీర్‌లో 'పుష్ప' సినిమాలోని ఐటెం సాంగ్ అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాటకు ఆమె వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.  కేవలం మూడు నిమిషాల ఈ పాట కోసం సమంత ఏకంగా 5 కోట్ల రూపాయలు తీసుకుంది. ఒక పాటకు ఇంత పెద్ద మొత్తం అందుకున్న మొదటి సౌత్ హీరోయిన్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది.

46
జీవితంలో స్ట్రగుల్స్ ఫేస్‌ చేసిన సమంత

కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నప్పుడే సమంత జీవితంలో పెద్ద తుపాను వచ్చింది. నటుడు నాగ చైతన్యని ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  నాలుగేళ్లకే ఆయనతో విడాకులు తీసుకుంది. ఆ వెంటనే 'మయోసైటిస్' అనే అరుదైన కండరాల వ్యాధి ఆమెను కుంగదీశాయి. అయినా సమంత ఓడిపోలేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుని, ఫీనిక్స్ పక్షిలా మళ్లీ తిరిగి వచ్చింది.

56
సమంత చేస్తున్న వ్యాపారాలు

నటనతో పాటు సమంత ఇప్పుడు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది. ఇటీవల 'శుభం' అనే సినిమాతో నిర్మాతగా మారి సక్సెస్ అందుకుంది. అలాగే మహిళల కోసం 'ఎథ్నిక్' దుస్తుల బ్రాండ్ అయిన 'సాకి' (Saaki) ని సొంతంగా ప్రారంభించారు. వీటితో పాటు 'మైల్ కలెక్టివ్' (Mile Collective), 'ట్రూలీ ఎస్‌ఎంఏ' (Truly SMA) అనే లైఫ్‌స్టైల్, యాక్టివ్‌వేర్ బ్రాండ్స్‌లోనూ ఆమె భాగస్వామ్యం ఉంది.

66
మా ఇంటి బంగారంతో రాబోతున్న సమంత

నటిగా కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా, బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సమంత, కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పేదరికం నుంచి మొదలుపెట్టి, ఈ రోజు కోట్లకు అధిపతిగా మారిన సమంత జర్నీ నిజంగా ఒక ‘రియల్ లైఫ్ బ్లాక్‌బస్టర్’ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంత `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తుంది. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఆమె చేసిన చిత్రమిది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతుంది. దీంతో బిగ్‌ స్క్రీన్‌పై మరోసారి ఆమె మెరవబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories