Folk Song:పెళ్లి అంటేనే సందడి. ఆ సందడి మొత్తాన్ని వధూవరులు స్వయంగా ఆడిపాడి చూపిస్తే ఇంకెంత సందడిగా ఉంటుంది. ఆ సందడి మొత్తం ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ లో క్లియర్ గా కనపడుతుంది. యూట్యూబ్ లో రెండు రోజుల నుంచి నాన్ స్టాప్ గా దుమ్మురేపుతున్న పాట ‘బాసింగ బలాలు’
తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు ఎన్నో ఫోక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. కానీ.. ఇప్పుడు వచ్చిన ఈ పెళ్లి పాట మాత్రం చానాళ్లు యాదకుండిపోతుంది. పాట విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది.ఆ పాట చూస్తున్నంత సేపు నిజంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ..తమ పెళ్లి కబుర్లు చెబుతున్నట్లుగానే ఉంది.
పాట మొదలవ్వడమే మంచి తెలంగాణ బీట్ తో మొదలైంది. ఆ బీట్ లోనే ఎంగేజ్మెంట్ చూపించారు. తర్వాత పెళ్లికి సంబంధించి ఒక్కొక్క ఘట్టాన్ని చాలా అందంగా చూపించారు. అబ్బాయి అమ్మాయి చేతికి గాజులు తొడుగుతుండగా పాట లిరిక్స్ మొదలయ్యాయి. ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో.. నుదిటికి పెళ్లి బాసికలు కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే.. ఆ మ్యూజిక్ కి మనకు కూడా డ్యాన్స్ వేయాలి అనిపించేలా ఉంటుంది.
24
పెళ్లి సందడంతా పాటలోనే..
అందమైన పెళ్లి పందిరి.. చుట్టూ చుట్టాలు... ఆ హడావిడి అంతా కళ్లకు కట్టినట్లు కనపడుతుంది.‘ బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే.. చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే.. ఈ పోరడి నిలువెత్తు ప్రాణాలే నాలో ఉన్నాయే.. శ్రావణ మాసపు బలాలే సై అన్నాయ్యే’ అంటూ పాట సాగింది. ఓ వైపు వధూవరులు సందడిగా డ్యాన్స్ వేస్తుంటే.. చుట్టూ పెద్దవాళ్లు అందరూ పసుపు కొట్టడం లాంటి పెళ్లి పనులు చేస్తూ ఉన్నారు. పాటలో భాగంగానే హల్దీ, మంగళ స్నానాలు, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఇతర పెళ్లి పనులన్నీ చాలా అందంగా చూపించారు. ఒక్క పాటలో తెలంగాణ పెళ్లి ట్రెడిషన్ మొత్తం చూపించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
34
ఈ పాటలో స్పెషాలిటీ ఇదే..
ఈ మధ్యకాలంలో చాలా ఫోక్ సాంగ్స్ వచ్చాయి కానీ.. వాటిల్లో పాట లిరిక్స్ కీ.. వాళ్ల డ్యాన్స్ కీ ఏ మాత్రం సంబంధం ఉండేది కాదు. కానీ.. ఈ పాట మాత్రం అలా కాదు.. పాట లిరిక్స్ కి కరెక్ట్ గా సూటయ్యేలా కొరియోగ్రాఫీ చేయడం విశేషం. అందుకే.. ఈ పాట అందరికీ నచ్చేస్తోంది. ఇక.. ఈ పాటకి డ్యాన్స్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా అందంగా ఉన్నారు. అబ్బాయి అయితే విజయ్ దేవరకొండ లా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పాటకు కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ ఇక నుంచి తెలంగాణలో ఏ పెళ్లి జరిగినా ఈ పాట కచ్చితంగా వినపడుతుంది’ అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. కరీంనగరోళ్లు పాట రాస్తే.. ఈ మాత్రం ఉంటుంది అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.. ఇక.. పాట లిరిక్స్, కొరియోగ్రఫీ చాలా అందంగా చూపించారు. చాలా మంది ఈ పాటకు అప్పుడే రీల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. అవి కూడా ట్రెండ్ అవుతున్నాయి.