'ఏ మాయ చేశావె', 'ఈగ', 'మెర్సల్', 'సూపర్ డీలక్స్', 'మజిలీ' వంటి చిత్రాలతో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి వెబ్ సిరీస్‌లతో సమంత ఇప్పుడు పాన్-ఇండియా స్టార్ అయ్యారు. ఇంత విజయం సాధించినా, ఆమె తన సింప్లిసిటీని, కష్టపడే తత్వాన్ని వదులుకోలేదు. అంతేకాదు ఆమె అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ తో బాధపడటం, దాన్నుంచి కోలుకున్నాక తండ్రి మరణించడం ఆమెకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వాటిని దాటుకుని ఇప్పుడు `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తోంది. ఇది త్వరలో విడుదల కానుంది.