సమంత బోల్డ్ డెసీషన్‌.. ఆ ఒక్క కారణంతో కోట్లు వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌

Published : Apr 15, 2025, 08:48 PM IST

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అదే ట్యాగ్‌కి ఏమాత్రం తక్కువ కాదు సమంత. ఆమె కేవలం హీరోయిన్‌గానే కాదు, అనేక విషయాల్లోనూ సూపర్‌ స్టార్ అనిపించుకుంది. స్ట్రాంగ్‌ ఉమెన్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్‌ హీరోలకు పోటీగా నిలుస్తుంది. ఈ క్రమంలో సమంత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అది చాలా బోల్డ్ డెసీషన్‌ కావడం విశేషం. సమాజ హితం కోసం ఆమె ఏకంగా కోట్లు వదులుకుంది. మరి ఆ కథేంటో చూద్దాం. 

PREV
15
సమంత బోల్డ్ డెసీషన్‌.. ఆ ఒక్క కారణంతో కోట్లు వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌
సమంత తన నిర్ణయం గురించి చెప్పింది

సినిమా సెలబ్రిటీలు, సూపర్‌ స్టార్స్.. గుట్కా, ఆన్‌లైన్ గేమింగ్ వంటి ఉత్పత్తుల ప్రకటనల్లో నటించి విమర్శల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ సమంత సమాజానికి మంచి సందేశం ఇవ్వని ప్రకటనలను తిరస్కరించానని చెప్పారు. కోట్ల రూపాయలను వదులుకున్న ఆమె నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

25
సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ‘గతంలో చాలా ప్రకటనల్లో నటించాను. కానీ ఇప్పుడు సమాజానికి మంచి సందేశం ఇవ్వని ప్రకటనల్లో నటించకూడదని అర్థం చేసుకున్నాను. గత సంవత్సరం దాదాపు 15 ప్రకటనలను తిరస్కరించాను. 

35
సమంత చెప్పిన నిజం

దానివల్ల నేను కోట్లల్లో నష్టపోయాను.  కానీ దానికి బాధపడటం లేదు. ఇతరుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపని ప్రకటనల్లో నేను నటించను. ఇప్పుడు నేను ఏదైనా ప్రకటనకు ఒప్పుకుంటే ముగ్గురు వైద్యులు పరిశీలించి, ఒప్పుకున్న తర్వాతే ముందుకు వెళ్తాను’ అని చెప్పారు.

45
యువతకు సమంత సందేశం

ఈ సందర్భంగా యువతకు ఓ సందేశం ఇచ్చిన ఆమె, చిన్న వయసులో మనం చాలా ఉత్సాహంగా ఉంటాం. నేనూ అలాగే ఉన్నాను. అందుకే కొన్ని సరికాని ప్రకటనల్లో నటించాను.  అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు నేను క్షమాపణలు కోరుతున్నాను. 

55
సమంతకు ప్రశంసలు

కాబట్టి మీ చిన్న వయసులో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. సమంత చెప్పిన ఈ నిజాయితీ మాటలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్‌స్టార్‌లు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 

read  more: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్ మేకప్‌ లేకుంటే ఎలా ఉంటారో చూశారా? ఇది పెద్ద సాహసమే

also read: కాలేజీలో దేవుడుగా పిలిపించుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినిమాల్లో ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories