రాంచరణ్ మూవీ వల్ల కెరీర్ నాశనం, స్టార్ క్రికెటర్ వల్ల పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడ్డ హీరోయిన్ ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రాల్లో నటించారు. కానీ కొన్ని చిత్రాల పరాజయాలు రాంచరణ్ ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. రాంచరణ్ ఫ్లాప్ చిత్రంలో హీరోయిన్ కి, ఒక స్టార్ క్రికెటర్ కి లింక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

Ram Charan and Yuvraj Singh connection with this heroine in telugu dtr
Ram Charan, Yuvraj Singh

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రాల్లో నటించారు. కానీ కొన్ని చిత్రాల పరాజయాలు రాంచరణ్ ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అందులో మొదటిది ఆరెంజ్ మూవీ. ఆరెంజ్ మూవీ ఎందుకు హిట్ కాలేదు అనే బాధ చరణ్ కి లైఫ్ లాంగ్ ఉంటుందట. ఆరెంజ్ మూవీ సాంగ్స్ తనకి ఫేవరెట్ ఆల్బమ్ అని చరణ్ చాలా సందర్భాల్లో తెలిపారు. 

Ram Charan and Yuvraj Singh connection with this heroine in telugu dtr
Ram Charan

అదే విధంగా డిజాస్టర్ గా నిలిచిన మరో చిత్రం తుఫాన్. ఆ చిత్రంలో ఎందుకు నటించానా ఆ మూవీ రిజల్ట్ చూశాక రాంచరణ్ ఫీల్ అయ్యాడు. ఆరెంజ్ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రంలో జెనీలియాతో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆ హీరోయిన్ పేరు షాజాన్ పదంసీ. అలిక్ పదంసీ, షారోన్ ప్రభాకర్ దంపతుల కుమార్తె షాజన్ పదంసీ. ఆమె తల్లిదండ్రులు కూడా చిత్ర పరిశ్రమలో రాణించారు. 


Shazahn Padamsee

ఆరెంజ్ చిత్రంలో షాజన్ రూబా పాత్రలో నటించింది. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో షాజన్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ఆరెంజ్ తర్వాత మసాలా చిత్రంతో పాటు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో మాత్రమే షాజన్ నటించింది. ఆరెంజ్ మూవీలో ఆమె పాత్ర నిడివి తక్కువ. పైగా గుర్తింపు కూడా రాలేదు. ఆరెంజ్ తర్వాత బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది కానీ వర్కౌట్ కాలేదు. 

Shazahn Padamsee

షాజన్ పదంసీ అప్పట్లో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కలసి ఒక కార్పొరేట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. ఆ టైంలో యువరాజ్ తో షాజన్ డేటింగ్ చేసినట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. జాతీయ మీడియా సైతం కోడై కూసింది. షాజన్, యువరాజ్ డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ తో తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ కావడంతో ఆమె వెంటనే మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలని ఖండించింది. 

Shazahn Padamsee

నేను యువరాజ్ ని మీట్ అయింది కేవలం రెండు సార్లు మాత్రమే. కార్పొరేట్ బ్రాండ్ యాడ్ కోసం ఒకసారి మీట్ అయ్యా, మరోసారి బుక్ లాంచ్ కార్యక్రమంలో మీట్ అయ్యా. దానికే ఇంత దారుణంగా రూమర్స్ క్రియేట్ చేస్తారా అంటూ లబోదిబోమంది. ప్రస్తుతం షాజన్ వయసు 37 ఏళ్ళు. ఇప్పటికీ ఆమె వివాహం చేసుకోలేదు. గత ఏడాది ఆశిష్ కనకియా అనే వ్యాపార వేత్తతో షాజన్ పదంసీ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జూన్ లో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారట.

Latest Videos

vuukle one pixel image
click me!