టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన అభిమానులకు రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ అదరగొడుతోంది.
కొన్నాళ్లుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంది. దాంతో సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఎలాంటి ప్రాజెక్ట్ కు వర్క్ చేయడం లేదు.
కొద్దిరోజుల నుంచి సమంత పూర్తిగా ఆరోగ్యంగా మారింది. చాలా యాక్టివ్ గా పబ్లిక్ అపియరెన్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతోంది.
కానీ తాజాగా మాత్రం సామ్ తన లుక్ తో షాకిచ్చింది. ఈసారి ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ట్రిప్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ బికినీ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది.
సామ్ మలేషియాలోని The Datai Langkawiలో ఉంది. నేచర్ కు దగ్గరగా ఉంటూ కనిపించింది. ఈ క్రమంలో బికినీలో కనిపించింది. ఏకాంతంగా కొలనులో ఈదుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే, సమంత చాలా రోజుల తర్వాత బికినీలో దర్శనమివ్వడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. సామ్ ఫొటోలను నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక సమంత చివరిగా ‘ఖుషి’ చిత్రంతో అలరించింది. నెక్ట్స్ ‘సిటాడెల్’ సిరిస్ తో అలరించనుంది.