‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. Animal The Film తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
26
ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ త్రిప్తి పేరు హాట్ టాపిక్ గ్గా వినిపిస్తోంది. బాలీవుడ్ చిత్రంతో సెన్సేషన్ గా మారిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆయా భాషల్లో అవకాశాలు అందుకుంటోంది.
36
ఇదిలా ఉంటే.. త్రిప్తి డిమ్రి పుట్టిన రోజు ఇవ్వాళ కావడం విశేషం. ఈ ముద్దుగుమ్మ నేటితో 30వ ఏటా అడుగుపెట్టింది. ఆమెకు ఫ్యాన్స్, నెటిజన్లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
46
గతంలో పెళ్లి గురించి మాట్లాడిన త్రిప్తి డిమ్రీ తనకు ‘అమాయకుడు, మంచి వ్యక్తిత్వం అయి ఉండే‘ వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక త్రిప్తి విజయ్ దేవరకొండకు జోడీగా గౌతమ్ తిన్ననూరు ప్రాజెక్ట్ లో నటించనుందని తెలుస్తోంది.
56
ఈ క్రమంలో త్రిప్తి డిమ్రీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ మెయిటెయిన్ చేస్తోందని తెలుస్తోంది. అతనితో ఎంతో క్లోజ్ గా ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
66
అతను కూడా త్రిప్తికి చాలా దగ్గరి వ్యక్తిలాగా విష్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ త్రిప్తి‘ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అతనే ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతోంది.