Dimple Hayathi : దుబాయ్ లో డింపుల్ హయాతీ డాన్స్.. తెలుగు బ్యూటీ లేటెస్ట్ లుక్ వైరల్.!

First Published | Feb 23, 2024, 7:42 PM IST

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple  Hayathi)   లేటెస్ట్ లుక్ షాకింగ్ గా మారింది. కొన్నాళ్లుగా కనిపించని యంగ్ బ్యూటీ బరువు పెరిగి గుర్తుపట్టనంతలా మారిపోయింది. ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

చాలా రోజుల తర్వాత తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ మీడియా కంటపడింది. పబ్లిక్ అపియరెన్స్ కూడా ఇవ్వని ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైంది. తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 

డింపుల్ హయాతీ కాస్తా లావుపెరిగి బొద్దుగా మారిపోయారు. ఒళ్లు చేసిన ఈ తెలుగు ముద్దుగుమ్మను సడెన్ గా చూస్తే గుర్తుపట్టడం కూడా కష్టంగానే మారింది. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో పెద్దగా సందడి చేయడం లేదు.


తాజాగా దుబాయ్ లో నిర్వహించిన గామా అవార్డ్స్ (Gama Awards) ఫంక్షన్ కు హాజరైంది. వేదికపై స్పెషల్ పెర్ఫామెన్స్ కూడా ఇచ్చింది. తన డాన్స్ తో ఆడియెన్స్ ను అలరించింది. 

ఇక ఆయా ప్రాజెక్ట్స్ ల్లోనూ నటిస్తున్నట్టు డింపుల్ చెప్పుకొచ్చింది. త్వరలో వాటి ప్రకటన ఉంటుందని చెప్పింది. ఇంతకీ ఎలాంటి మూవీస్ లో నటిస్తోందనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం ఆమె బరువు పెరగడం ఆసక్తికరంగా మారింది. 

ఆ మధ్యలో వరసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సందడి చేసింది. కానీ ఆ మధ్యలో ట్రాఫిక్ పోలీస్ తో జరిగిన ఘర్షణ తర్వాత పెద్దగా కనిపించడం లేదు. మళ్లీ ఇప్పుడు మెరిసింది. 

సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయలేదు. రవితేజ ‘ఖిలాడి’ చిత్రంతో సక్సెస్ అందుకుంది. చివరిగా గోపీచంద్ సరసన ‘రామబాణం’తో అలరించింది. 

Latest Videos

click me!